భారత వృద్ధిపై మరింత ఆందోళనలు పెంచుతూ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి అంచనాను 5.5 శాతానికి తగ్గిస్తున్నట్లు తాజా నివేదికలో వెల్లడించింది. రుణభారంతో ఒత్తిడిలో ఉన్న బ్యాంకింగ్, బ్యాంకింగేతర ఆర్థిక రంగాలు వృద్ధి క్షీణతకు కారణమవుతున్నట్లు పేర్కొంది.
ఈ ఏడాది జూన్లో విడుదల చేసిన అంచనాల్లో.. దేశ జీడీపీ 6.6 శాతంగా నమోదవుతుందని ఫిచ్ పేర్కొంది.
భారతీయ రిజర్వు బ్యాంకూ ఇటీవలే దేశ జీడీపీ అంచనాను 6.1 శాతానికి తగ్గించడం గమనార్హం.