తెలంగాణ

telangana

ETV Bharat / business

భారత్​లో మొదటి 5జీ ఫోన్.. ధర ఎంతో తెలుసా? - realme x 50 pro price in india

భారత్​లో మొదటి 5జీ మొబైల్​ను ప్రవేశపెట్టనుంది రియల్​మీ. భారత్​తోపాటు స్పెయిన్​లోనూ ఏకకాలంలో విడుదల చేయనున్న ఎక్స్​50ప్రో​ ధరలు ఇలా ఉండనున్నాయి.

BIZ-5G HANDSET
రియల్​ మీ

By

Published : Feb 20, 2020, 1:02 PM IST

Updated : Mar 1, 2020, 10:49 PM IST

భారత్​లో మొదటి 5జీ ఫోన్​ను చైనాకు చెందిన స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ రియల్​మీ తీసుకురానుంది. దేశంలో ఐదో తరం నెట్​వర్క్​కు​ మద్దతు లేకున్నా ఈ నెల 24న 5జీ స్మార్ట్​ ఫోన్​ 'ఎక్స్​50ప్రో'ను విడుదల చేయనుంది.

ఫోన్ల ధరకు సంబంధించి రియల్​మీకి చెందిన ఓ అధికారి పలు విషయాలు వెల్లడించారు.

"స్నాప్​డ్రాగన్​ 865 ప్రాసెసర్​తో వచ్చే రియల్​మీ 5జీ మొబైల్ ధర రూ.50,000 వరకు ఉండే అవకాశం ఉంది. తక్కువ సామర్థ్యం కలిగిన చిప్​సెట్​తో వచ్చే ఫోన్​ రూ.25,790 ఉంటుంది."

- రియల్​మీ అధికారి

ఎక్స్​50ప్రోను భారత్​తో పాటు స్పెయిన్​లోనూ ఏకకాలంలో విడుదల చేయనుంది రియల్​మీ.

రియల్​మీ కాకుండా చైనాకు చెందిన మరో కొత్త స్మార్ట్​ఫోన్​ బ్రాండ్​ ఐకూ 3 కూడా ఫిబ్రవరి 25న 5జీ ఫోన్​ను భారత్​లో ఆవిష్కరించనుంది.

ఇదీ చూడండి:భారత్​ మార్కెట్​లోకి స్మార్ట్​ టూత్​బ్రష్- ధర తెలుసా?

Last Updated : Mar 1, 2020, 10:49 PM IST

ABOUT THE AUTHOR

...view details