తెలంగాణ

telangana

ETV Bharat / business

ఇన్ఫోసిస్​పై కేంద్రం సీరియస్- ఎండీకి సమన్లు - సలీల్​ పరేఖ్​కు ఆర్థిక శాఖ నోటీసులు

దేశీయ టెక్​ దిగ్గజం ఇన్ఫోసిస్ ఎండీ, సీఈఓ సలీల్​ పరేఖ్​కు (Fin min Summons Salil Parekh) ఆర్థిక శాఖ సమన్లు జారీ చేసింది. కొత్త ఐటీ పోర్టల్​ అందుబాటులోకి వచ్చి 2 నెలలు దాటినా.. ఇంకా సాంకేతిక సమస్యలను (glitches in New IT portal) పరిష్కరించకపోవడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Infosys
ఇన్ఫోసిస్​

By

Published : Aug 22, 2021, 3:19 PM IST

Updated : Aug 22, 2021, 6:01 PM IST

ఆదాయపు పన్ను శాఖ కొత్త వెబ్‌పోర్టల్‌లో సాంకేతిక లోపాల (glitches in New IT portal) విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సీరియస్​గా తీసుకుంది. ఈ నేపథ్యంలో పోర్టల్​ను అభివృద్ధి చేసిన టెక్​ కంపెనీ ఇన్ఫోసిస్​ను వివరణ ఇవ్వాలని (Center ask Explanation from Infosys) ఆదేశించింది.

పోర్టల్​ ప్రారంభించి రెండు నెలలు దాటినపట్టికీ.. లోపాలను ఎందుకు పరిష్కరించలేదని ఇన్ఫోసిస్​ ఎండీ, సీఈఓ సలీల్​ పరేఖ్​కు సమన్లు జారీ చేసింది ఆర్థిక శాఖ (Fin min summoned Infosys MD). ఈ విషయంపై సోమవారం (ఆగస్టు 23న) ఆర్థిక మంత్రికి వివరణ ఇవ్వాలని సూచించింది. శనివారం (ఆగస్టు 21) కూడా కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్​ 'not available' అని మొరాయించిన విషయాన్ని గుర్తు చేసింది.

కొత్త పోర్టల్​ ఎందుకంటే..

రిటర్నులను మరింత సులభతరం చేసే ఉద్దేశంతో ఈ ఏడాది జూన్ 7వ తేదీన ఈ కొత్త వెబ్​సైట్​ను అందుబాటులోకి తెచ్చింది ఆర్థిక శాఖ. అయితే కొత్త పోర్టల్​లో ఆది నుంచే లోపాలు ఉండటం వల్ల చాలా మంది నుంచి ఫిర్యాదులు (Complaints on New IT portal) అందాయి. దాదాపు 2000 లోపాలు ఉన్నట్లు ఫిర్యాదుల ద్వారా తెలిసింది. ఇందులో 90 కొత్త రకాల సమస్యలు ఉన్నట్లు కూడా వెల్లడైంది.

వరుస ఫిర్యాదులతో లోపాలను వెంటనే సరిచేయాలని ఇన్ఫోసిస్​కు సూచించింది ఆర్థిక శాఖ. పలు మార్లు గడువు విధించినప్పటికీ ఇంకా పోర్టల్​లో సమస్యలు మాత్రం తొలగిపోలేదు. దీనితో కంపెనీపై ఆర్థిక శాఖ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

రూ.164.5 కోట్లు..

ఈ పోర్టల్‌ తయారీ కాంట్రాక్ట్‌ ఇన్ఫోసిస్‌కు 2019లో దక్కింది. ఆదాయపు పన్ను రిటర్నులు ప్రాసెసింగ్‌ సమయాన్ని 63 రోజుల నుంచి ఒక్క రోజుకు తగ్గించేందుకు దీనిని చేపట్టింది. 2019 జనవరి-2021 జూన్​ వరకు కొత్త పోర్టల్ అభివృద్ధికోసం ఇన్ఫోసిస్​కు రూ.164.5 కోట్లు చెల్లించింది కేంద్రం.

ఇదీ చదవండి:Petrol Price today: 36 రోజుల తర్వాత తగ్గిన పెట్రోల్ ధర

Last Updated : Aug 22, 2021, 6:01 PM IST

ABOUT THE AUTHOR

...view details