తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎయిర్​ఇండియా కొనుగోలుకు టాటా సన్స్​ ఫినాన్షియల్ బిడ్​! - ఎయిర్​ ఇండియా ప్రైవేటీకరణ ఎందుకు

ఎయిర్​ఇండియా కొనుగోలుకు(Air India disinvestment) టాటా సన్స్​ సహా పలు సంస్థలు ఫినాన్షియల్ బిడ్లు సమర్పించాయి. ఇందుకు బుధవారమే తదు గడువు కాడవం వల్ల ఆయా సంస్థలు తమ బిడ్లను సమర్పించినట్లు తెలిసింది.

Air india
ఎయిర్​ ఇండియా

By

Published : Sep 15, 2021, 6:38 PM IST

Updated : Sep 15, 2021, 7:53 PM IST

సంక్షోభంలో కూరుకుపోయిన ఎయిర్​ఇండియాను(Air India disinvestment) కొనుగోలు చేసేందుకు బుధవారం.. వివిధ కంపెనీలు ఫినాన్షియల్ బిడ్లు దాఖలు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బిడ్ల దాఖలుకు బుధవారమే తుది గడువని ఇదివరకే ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇందుకు ఆసక్తిగా ఉన్న కంపెనీలు తమ బిడ్లను సమర్పించినట్లు తెలుస్తోంది.

ఫినాన్షియల్ బిడ్​ దాఖలు చేసిన కంపెనీల జాబితాలో టాటా సన్స్​ కూడా ఉన్నట్లు ఆ సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

'ట్రాన్సాక్షన్​ అడ్వైజర్​ ద్వారా ఎయిర్‌ ఇండియా పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన ఫినాన్షియల్​ బిడ్లు అందాయి. ఇక తదుపరి ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది' పార్ట్​మెంట్ ఆఫ్​ ఇన్వెస్ట్​మెంట్​ అండ్​ పబ్లిక్​ అసెట్​ మేనేజ్​మెంట్​ (దీపమ్​) ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఎయిర్​ఇండియాలో 100 శాతం వాటాను ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిజానికి.. 2018లో ఎయిర్‌ ఇండియాలో 76 శాతం వాటా విక్రయానికి ప్రభుత్వం ప్రయత్నించగా.. కొనుగోలుదారులు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో 100 శాతం వాటా విక్రయానికి ప్రభుత్వం సిద్ధమైంది.

ఎయిర్‌ ఇండియాకు మొత్తం రూ.43 వేల కోట్ల మేరకు రుణాలు ఉన్నాయి. వీటిల్లో రూ.22 వేల కోట్ల రుణాలను ఎయిర్‌ ఇండియా అసెట్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌కు బదిలీ చేయనున్నారు. ఈ రుణాల చెల్లింపునకు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. అంటే సంస్థను వేరే వారికి బదిలీ చేసేనాటికి ప్రభుత్వం ఈ రుణాలు మొత్తం చెల్లించాల్సి ఉంది. ఈ అంశంపై ప్రభుత్వం ఎటువంటి ప్రతిపాదనలను బహిర్గతం చేయలేదు.

ఇదీ చదవండి:GST on Swiggy: స్విగ్గీ, జొమాటో సేవలపై జీఎస్​టీ?

Last Updated : Sep 15, 2021, 7:53 PM IST

ABOUT THE AUTHOR

...view details