స్థిరాస్తి రంగం డెవలపర్ల లాభాలపై పదేళ్లపాటు పన్ను మినహాయింపు ఇవ్వాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ముఖ్యంగా స్థిరాస్తి రంగంలో పెట్టుబడులను పెంచడం, ఆర్థిక వృద్ధికి ఊతమందించేందుకు ఈ నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల జరిగిన ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, రియల్ ఎస్టేట్ డెవలపర్ల సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. ఇందులో ఈ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై సలహాలు ఇవ్వాల్సిందిగా మంత్రిత్వశాఖను కోరారు డెవలపర్లు. లాభాలపై పదేళ్లు పన్ను మినహాయింపులు కావాలని కూడా మంత్రిత్వ శాఖకు విన్నవించినట్లు సమాచారం.
ప్రోత్సాహం ఎందుకు?
కొన్నేళ్లుగా దేశ జీడిపీలో పెట్టుబడులు 36 శాతం నుంచి 29 శాతానికి తగ్గాయి. ఇందుకు రియల్టీ రంగంలో మందగమనమే ప్రధాన కారణమని ఆర్థిక మంత్రిత్వ శాఖ గుర్తించింది.