ప్రభుత్వ రంగ బ్యాంకుల ముఖ్య కార్యనిర్వాహణాధికారులతో నేడు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్థిక రంగానికి చేయూత అందించే దిశగా డిపాజిట్లు పెంచడం సహా మరిన్ని సమస్యలపై ఈ భేటీలో చర్చించనున్నారు.
బ్యాంకింగేతర ఆర్థిక కార్పొరేషన్లు, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థల్లోకి నిధుల ప్రవాహం పైనా సమీక్షించనున్నారు నిర్మల. పాక్షిక రుణ హామీ పథకం, మూలధనాన్ని పెంచేందుకు మార్కెట్ల నుంచి నిధులను రాబట్టడంపై ఈ సమావేశంలో ఆర్థికమంత్రికి బ్యాంకర్లు నివేదిక సమర్పించే అవకాశాలున్నాయి.