తెలంగాణ

telangana

ETV Bharat / business

అమ్మాయిల వివాహ వయసు పెరగనుందా..?

అమ్మాయిల వివాహ వయసు పెరగనుందా...? ఈ అంశంపై సిఫారసు చేయడానికి టాస్క్​ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్​ సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రతిపాదించారు. ఆడవారిలో పోషక విలువలు మెరుగుపడటం, శిశు మరణాలు తగ్గినందున వివాహ వయసును సవరించేందుకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.

By

Published : Feb 1, 2020, 2:51 PM IST

finance-minister-nirmala-seetha-raman-on-women
అమ్మాయిల వివాహ వయసు పెరగనుందా..?

స్త్రీల వివాహ వయసు మార్పునకు సిఫారసు చేయడానికి టాస్క్​ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రతిపాదించారు. ఈ అంశంపై ఆరు నెలల్లో తుది నివేదిక ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. అమ్మాయిలలో పోషక విలువలు మెరుగుపడటం, శిశు మరణాలు తగ్గినందున వివాహ వయసును సవరించేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు విత్తమంత్రి తెలిపారు. ప్రస్తుతం ఆడవారి వివాహ వయసు 18 ఏళ్లుగా ఉంది... భవిష్యత్తులో ఇది పెరగనుంది.

విద్యలో బాలికల ముందంజ

భేటీ బచావో భేటీ పఢావో గొప్ప విజయాన్ని సాధించిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ అన్నారు. ఈ పథకం ద్వారా విద్యలో దేశవ్యాప్తంగా అన్ని స్థాయిల్లో ఆడపిల్లల సంఖ్య పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల స్థాయి నుంచి ఉన్నతస్థాయి విద్య వరకు బాలికలు ముందంజలో ఉన్నారని తెలిపారు. పౌష్టికాహార పథకం కోసం రూ.35,600 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. మహిళలు, శిశువులకు పౌష్టికాహారం అందించేందుకు రూ.28,600 కోట్లు కేటాయించామన్నారు.

అమ్మాయిల వివాహ వయసు పెరగనుందా..?

ఇవీచూడండి:ఆరోగ్యానికి పెద్ద పీట: '2025 కల్లా క్షయ నిర్మూలన'

ABOUT THE AUTHOR

...view details