తెలంగాణ

telangana

ETV Bharat / business

25 బేసిస్ పాయింట్ల వడ్డీ తగ్గించిన ఫెడ్​ - తగ్గిన ఫెడ్ వడ్డీ

వరుసగా రెండో సారి వడ్డీ రేట్లు తగ్గించింది అమెరికా ఫెడరల్ రిజర్వ్​. తాజా సవరణలో 25 బేసిస్ పాయింట్లు వడ్డీ తగ్గించినట్లు ఫెడ్​ అధికారికంగా ప్రకటించింది.

ఫెడ్​ వడ్డీ రేట్లు

By

Published : Sep 19, 2019, 2:15 PM IST

Updated : Oct 1, 2019, 4:57 AM IST

అమెరికా ఫెడరల్​ రిజర్వ్​ వడ్డీ రేట్లు 25 బేసిస్​ పాయింట్లు తగ్గించింది. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించడం వరుసగా ఇది రెండో సారి. అమెరికా ఫినాన్షియల్​ మార్కెట్లో నగదు లోటును తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది ఫెడ్​.

ఫెడ్ రిజర్వ్ పాలసీ కమిటీలోని 10 మంది సభ్యుల్లో ఏడుగురు వడ్డీ తగ్గింపునకు సానుకూలంగా ఓటేయగా.. ముగ్గురు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.

ఈ తగ్గింపుతో 2018లో పెంచిన వడ్డీ రేట్లలో సగం మేరకు వెనక్కి తీసుకున్నట్లయింది. అదే సమయంలో ఫెడ్‌ వద్ద బ్యాంకులు ఉంచే నగదుపై ఇచ్చే వడ్డీరేటును కూడా 30 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించింది.

అమెరికాలో వినియోగదారుల ఖర్చుల్లో వృద్ధి ఉన్నప్పటికీ.. వ్యాపారాలకు పెట్టుబడులు, ఎగమతులు మాత్రం బలహీనంగానే ఉంటున్నాయని ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ పేర్కొంది. అయితే చైనాతో వాణిజ్య యుద్ధం కారణంగా అస్థిరత నెలకొందని ఫెడ్‌ అధికారులు ఇప్పటికే అనేకసార్లు బహిరంగంగా పేర్కొనడం గమనార్హం.

ఇదీ చూడండి: ఉద్దీపన పథకాలు ఇప్పుడే వద్దు: దువ్వూరి సుబ్పారావు

Last Updated : Oct 1, 2019, 4:57 AM IST

ABOUT THE AUTHOR

...view details