తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆరు నెలల్లో 15 శాతం పెరిగిన 'ఎఫ్​డీఐ'లు - వాణిజ్య వార్తలు

భారత్​కు 2019-20 తొలి అర్ధభాగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్​డీఐ) 15 శాతం మేర పెరిగినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్​ నుంచి సెప్టెంబర్​ మధ్య మొత్తం 26 బిలియన్​ డాలర్ల ఎఫ్​డీఐలు వచ్చినట్లు వెల్లడించింది.

FDI
ఎఫ్​డీఐ

By

Published : Jan 2, 2020, 12:07 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో.. భారత్​కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్​డీఐ) 15 శాతం పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాల్లో తెలిసింది. ఈ లెక్కల ప్రకారం 2019-20 ఏప్రిల్​-సెప్టెంబర్ మధ్య 26 బిలియన్​ డాలర్ల ఎఫ్​డీఐలు వచ్చాయి. అంతకు ముందు 2018-19 తొలి అర్ధ భాగంలో ఎఫ్​డీఐలు 22.66 బిలియన్​ డాలర్లుగా ఉన్నాయి.

రంగాల వారీగా లెక్కలు..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో.. సేవారంగం (4.45 బిలియన్ డాలర్లు), కంప్యూటర్​ సాఫ్ట్​వేర్, హార్డ్​వేర్​ (4 బిలియన్​ డాలర్లు), టెలికమ్యూనికేషన్​(4.28 బిలియన్​ డాలర్లు), ఆటోమొబైల్​ (2.13 బిలియన్​ డాలర్లు), ట్రేడింగ్​లకు (2.14బిలియన్​ డాలర్లు) అధికంగా ఎఫ్​డీఐలు వచ్చినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

సింగపూర్​ నుంచి అధికంగా..

2019-20 తొలి ఆరు నెలల్లో భారత్​కు సింగపూర్​ నుంచి అత్యధికంగా 8 బిలియన్​ డాలర్ల ఎఫ్​డీఐలు వచ్చినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ తర్వాతి స్థానాల్లో మారిషస్​ (6.36 బిలియన్​ డాలర్లు), అమెరికా (2.15 బిలియన్​ డాలర్లు),నెదర్లాండ్స్​ (2.32 బిలయన్​ డాలర్లు), జపాన్​ (1.78 బిలియన్​ డాలర్లు)లు ఉన్నాయి.

ఇదీ చూడండి:రాబోయే బడ్జెట్‌లో ఆదాయపు పన్ను తగ్గిస్తారా?

ABOUT THE AUTHOR

...view details