తెలంగాణ

telangana

ETV Bharat / business

"ఇంకా చాలా దూరం ప్రయాణించాలి"

అల్ప ద్రవ్యోల్బణం కొనసాగే స్థాయిని చేరుకోవటానికి ఆర్థిక వ్యవస్థ ఇంకా దూరంలోనే ఉందని హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు తాజా నివేదికలో వెల్లడించింది. ఇందుకు ప్రధాన కారణం రాష్ట్రాల మధ్య ద్రవ్యోల్బణంలో తేడాలు ఉండటమేనని తెలిపింది.

By

Published : Mar 30, 2019, 3:13 PM IST

ద్రవ్యోల్బణం

రాష్ట్రాల మధ్య ధరల పెరుగుదలలో వ్యత్యాసంతో అల్ప ద్రవ్యోల్బణం కొనసాగే స్థాయిని చేరుకోవటానికి ఆర్థిక వ్యవస్థ ఇంకా దూరంలోనే ఉందని అంచనా వేసింది హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు తాజా నివేదిక.

ద్రవ్యోల్బణం తగ్గుతోందని కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నప్పటికీ, రాష్ట్ర స్థాయి గణాంకాల పరిస్థితి మరోలా ఉందని తెలిపింది.

వచ్చే గురువారం జరగనున్న ద్రవ్య విధాన సమీక్షకు ముందు ఈ నివేదిక విడుదలవటం గమనార్హం. ఆర్థిక వ్యవస్థ అల్ప ద్రవ్యోల్బణ స్థాయిలోకి శాశ్వతంగా మారిందా? లేదా తాత్కాలికమేనా? అన్నదే రిజర్వు బ్యాంకు ముందున్న సవాలని నివేదిక పేర్కొంది.

కేరళలో ద్రవ్యోల్బణం 5.5 శాతం, హిమాచల్​ ప్రదేశ్​లో 2 శాతంగా ఉంది. వినియోగ ధరల సూచీ ప్రకారం జాతీయ స్థాయిలో ధరల పెరుగుదల 2.6 శాతంగా ఉంది.

రాష్ట్రాల మధ్య ద్రవ్యోల్బణ గణాంకాల్లో తేడాలు ప్రాంతీయ డిమాండ్​, సరఫరాల మధ్యనున్న వ్యత్యాసాలను స్పష్టంగా సూచిస్తున్నాయని నివేదిక పేర్కొంది. వాటిని అధిగమించాల్సిన అవసరం ఉందని తెలిపింది.

హెచ్​డీఎఫ్​సీ నివేదిక ప్రకారం తక్కువ ద్రవ్యోల్బణం ఉన్న రాష్టాలు హిమాచల్ ప్రదేశ్​, ఆంధ్ర ప్రదేశ్​, తెలంగాణ, గోవా, హరియాణాలు.... అసోం, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్​లు అధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి.

గత నెలలో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్ల తగ్గింపు కొనసాగవచ్చని ఆర్బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ వెల్లడించారు. అయితే ద్రవ్యోల్బణం లక్ష్యాలను చేరకున్నప్పుడే ఇది సాధ్యమని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details