మార్కెట్లో ఈ మధ్య కాలంలో నకిలీ ఔషధాల దందా విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా కరోనా వ్యాధికి వినియోగించే మందుల విషయంలో నకిలీలు పెద్ద ఎత్తున బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు నిజమైన మందులను గుర్తించే విధంగా.. తమ కంపెనీ ఔషధాలకు ప్రత్యేక ప్యాకింగ్ టెక్నాలజీని వాడనున్నట్లు జైడస్ క్యాడిలా వెల్లడించింది.
కంపెనీ ఉత్పత్తులైన రెమ్‌డెసివర్, విరఫిన్ ఇంజక్షన్ వంటి ఔషధాలతో మొదటగా ఈ కొత్త రకం ప్యాకింగ్‌ను ప్రారంభించనున్నట్లు జైడస్ క్యాడిలా తెలిపింది. జూన్ మూడో వారంలో ఈ ప్యాకింగ్‌తో ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొంది. రానున్న రోజుల్లో ఇతర ఔషధాలకు ఈ విధమైన ప్యాకింగ్‌ను అమలు చేయనున్నట్లు వివరించింది.