తెలంగాణ

telangana

ETV Bharat / business

జియోలో ఫేస్‌బుక్‌ భారీ పెట్టుబడులు-10 శాతం వాటా కొనుగోలు! - వ్యాపార వార్తలు

దేశంలో అతిపెద్ద టెలికాం దిగ్గజం జియోలో.. ఫేస్‌బుక్‌ భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. జియోలో 10 శాతం వాటా కొనుగోలుకు ఫేస్‌బుక్‌ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇరు సంస్థలు ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు.

facebook investment in jio
జియోలో ఫేస్‌బుక్ భారీ పెట్టుబడి

By

Published : Mar 25, 2020, 8:17 PM IST

సామాజిక మాధ్యమాల దిగ్గజం ఫేస్‌బుక్, ప్రముఖ టెలికాం సంస్థ రిలయెన్స్ జియోలో పదిశాతం వాటా కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఫేస్‌బుక్‌ ప్రణాళికలు రచిస్తున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ కథనం పేర్కొంది.

అయితే రిలయన్స్ జియో కానీ, ఫేస్‌బుక్‌ కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు లాక్‌డౌన్ కారణంగా ఒప్పందం కుదిరేందుకు మరింత సమయం పట్టవచ్చని ఇంటర్నేషనల్ ఫైనాన్సియల్ డైలీ పేర్కొంది.

ఈ నెలాఖరు కల్లా జియోను అప్పుల్లేని సంస్థగా తీర్చిదిద్దాలని రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే జియోలో ఫేస్‌బుక్‌ వాటా కొనుగోలు చేసే అవకాశాలున్నాయంటూ వార్తలు వెలువడుతున్నాయి.

ఇదీ చూడండి:3 వారాల లాక్‌డౌన్‌తో అన్ని లక్షల కోట్లు నష్టమా?

ABOUT THE AUTHOR

...view details