తెలంగాణ

telangana

ETV Bharat / business

అక్టోబర్​లో తగ్గిన భారత ఎగుమతులు, దిగుమతులు - బిజినెస్ వార్తలు తెలుగు

అక్టోబర్​లో భారత ఎగుమతులు 1.11 శాతం తగ్గాయి. దిగుమతులు 16.31 శాతం క్షీణించాయి. గత ఎగుమతుల పూర్తి విలువ 26.38 బిలియన్​ డాలర్లుగా ఉండగా.. దిగుమతుల పూర్తి విలువ 37.39 బిలియన్ డాలర్లుగా నమోదైంది.

వాణిజ్య లోటు

By

Published : Nov 15, 2019, 8:25 PM IST

అక్టోబర్​లో భారత ఎగుమతులు తగ్గినట్లు అధికారిక గణాంకాల్లో వెల్లడైంది. గత నెల దేశ ఎగుమతులు 1.11 శాతం క్షీణించాయి. ఎగుమతుల మొత్తం విలువ 26.38 బిలియన్ డాలర్లకు చేరినట్లు తెలిసింది. పెట్రోలియం, లెదర్ ఉత్పత్తుల ఎగుమతులు ఎక్కువగా క్షీణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

అంతకు ముందు సెప్టెంబర్​లోనూ ఎగుమతులు 6.57 శాతం తగ్గి.. 26 బిలియన్​ డాలర్లకు పరిమితమవ్వడం గమనార్హం.అక్టోబర్​లో దిగుమతులు 16.31 శాతం తగ్గాయి. మొత్తం దిగుమతుల విలువ 37.39 బిలియన్​ డాలర్లుగా ఉన్నట్లు గణాంకాల్లో తెలిసింది.

అక్టోబర్​లో వాణిజ్య లోటు 11 బిలియన్ డాలర్లు పెరిగింది. గత ఏడాది ఈ లోటు 18 బిలియన్​ డాలర్లుగా ఉంది.

ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్​ నుంచి అక్టోబర్​ వరకు ఎగమతులు 2.21 శాతం తగ్గాయి. మొత్తం ఎగుమతుల విలువ 185.5 డాలర్లకు చేరింది. ఏప్రిల్​ నుంచి అక్టోబర్​ మధ్య దిగుమతులు 8.37 శాతం క్షీణించాయి. దిగుమతుల పూర్తి విలువ 280 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గడిచిన ఏడు నెలల కాలంలో వాణిజ్యలోటు 94.72 బిలియన్​ డాలర్లకు చేరింది.

ఇదీ చూడండి: లండన్​లో ఆస్తులు కొనే భారతీయులు 11 శాతం వృద్ధి..

ABOUT THE AUTHOR

...view details