తెలంగాణ

telangana

ETV Bharat / business

'టిక్ టాక్', 'హలో'లకు భారత్​లో సమాచార కేంద్రం! - టిక్ టాక్ డాటా కేంద్రం

టిక్ టాక్, హలోల మాతృ సంస్థ బైట్ డ్యాన్స్ భారత్​లో సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ అంశంపై పరిశీలనలు జరుగుతున్నట్లు వెల్లడించింది.

టిక్ టాక్

By

Published : Jul 22, 2019, 5:45 AM IST

భారత​ యూజర్ల సమాచారాన్ని భద్రపరిచేందుకు స్థానికంగా డాటా కేంద్రాన్ని నెలకొల్పే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు టిక్​ టాక్, హలో యాప్​ల మాతృసంస్థ బైట్ డ్యాన్స్ ప్రకటించింది.

'దేశ వ్యతిరేక కార్యకలాపాల' ఆరోపణలతో భారత ప్రభుత్వం టిక్ టాక్, హలో యాప్​లకు నోటీసులు పంపింది. ప్రభుత్వ నోటీసులకు జులై 22 లోగా సరైన వివరణ ఇవ్వకపోతే నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో బైట్​డ్యాన్స్ తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

"డాటా సంరక్షణ చట్టం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలను మేం గుర్తించాం. ఇందులో భాగంగా భారత్​లో సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మేం ప్రయత్నాలు మొదలు పెట్టాం."
- బైట్ డ్యాన్స్

టిక్ టాక్, హలో యాప్​లను భారత్​లో ఆవిష్కరించినప్పటికీ.. వినియోగదారుల సమాచారాన్ని అమెరికా, సింగపూర్​లో ఉన్న థర్డ్ పార్టీ డాటా కేంద్రాల్లో భద్రపరుస్తున్నట్లు బైట్ డ్యాన్స్ పేర్కొంది.

ఇదీ చూడండి: 'భారత్​మాలా'కు ఎల్​ఐసీ రూ. 1.25 లక్షల కోట్ల రుణం

ABOUT THE AUTHOR

...view details