తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్రమాదపు అంచున ప్రపంచ వృద్ధి: క్రిస్టిన్​ లగార్డే - క్రిస్టిన్​ లగార్డె

ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఐఎంఎఫ్​ మాజీ అధినేత్రి క్రిస్టిన్​ లగార్డే​ ఆందోళన వ్యక్తం చేశారు. పాలసీ రూపకర్తలు వృద్ధి ప్రోత్రాహకాలను రూపొందించాలని సూచించారు. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు.

క్రిస్టిన్​ లగార్డె

By

Published : Sep 20, 2019, 2:05 PM IST

Updated : Oct 1, 2019, 8:04 AM IST

ప్రపంచ ఆర్థిక వృద్ధి ప్రమాదపు అంచున ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) మాజీ అధినేత్రి క్రిస్టిన్ లగార్డే హెచ్చరించారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు విధాన నిర్ణేతలు కృషి చేయాలని ఆమె సూచించారు.

బ్రెగ్జిట్​, వాణిజ్య యుద్ధం వంటి సమస్యలకు.. ఆయా దేశాల స్వయంకృత తప్పిదాలే కారణమని ఆమె పేర్కొన్నారు. వాణిజ్య ఉద్రిక్తతలు ప్రపంచ వృద్ధిని తగ్గిస్తున్నాయన్నారు లగార్డే. 2008లో ఆర్థిక సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి వృద్ధి 3.2 శాతం నుంచి 2.9 శాతానికి తగ్గినట్లు అంచనా వేశారు.

అమెరికాతో వాణిజ్య యుద్ధం వల్ల చైనా ఆర్థిక వృద్ధి మందగిస్తోందన్న లగార్డే మాంద్యం పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆయా దేశాల రిజర్వు బ్యాంకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. వాటితో పాటు ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరముందని గుర్తుచేశారు.

ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్​ పదవి నుంచి గతవారమే వైదొలిగిన లగార్డే​.. త్వరలో యూరోపియన్ కేంద్ర బ్యాంకు అధినేత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఇదీ చూడండి: సర్కారు నిర్ణయాలతో వృద్ధికి ప్రోత్సాహం: ఆర్​బీఐ

Last Updated : Oct 1, 2019, 8:04 AM IST

ABOUT THE AUTHOR

...view details