తెలంగాణ

telangana

ETV Bharat / business

హైడ్రోజన్​తో నడిచే విమానం.. పూర్తిగా పర్యావరణ హితం - Greenhouse gas emissions news

వాతావరణ కాలుష్యం ప్రస్తుతం మానవాళికి ఓ పెద్ద సమస్య. ఇంధనాల వాడకంతో కర్బన ఉద్గారాలు వెలువడి కాలుష్యం మరింత పెరిగిపోతోంది. అందుకు పరిష్కారంగా విద్యుత్​ వాహనాలు వస్తుంటే.. ఎయిర్​బస్​ మరో అడుగు ముందుకేసింది.2035 నాటికి హైడ్రోజన్​ ఇంధనంగా పనిచేసే తొలి ఉద్గార రహిత విమానాన్ని సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

European planemaker Airbus reveals zero emissions hydrogen-fuelled aircraft by 2035
హైడ్రోజన్​తో నడిచే విమానం.. పూర్తిగా పర్యావహణహితం

By

Published : Sep 21, 2020, 7:50 PM IST

హైడ్రోజన్‌ ఆధారంగా ప్రయాణించే విమాన తయారీపై పరిశోధనలను ఎయిర్‌బస్‌ ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా 200 మంది ప్రయాణికులతో 2,000 నాటికల్‌ మైళ్ల దూరం ప్రయాణించే విమానం డిజైన్లను సిద్ధం చేసింది. దీనిలో హైడ్రోజన్‌ ఆధారంగా పనిచేసేలా మార్పులు చేసిన గ్యాస్‌ టర్బైన్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఇటువంటి మొత్తం మూడు డిజైన్లను సిద్ధం చేసింది. 2035 నాటికి విమానాలను ఉద్గార రహితంగా మార్చేందుకు సిద్ధం చేసిన ప్రణాళికలో భాగంగా దీనిని సిద్ధం చేస్తున్నారు.

ముఖ్యంగా 200 మంది పట్టే ఏ321 నియో విమానాలను ఈ సరికొత్త ఇంజిన్లతో 2,000 నాటికల్‌ మైళ్ల దూరం ప్రయాణించేలా ప్లాన్‌ చేస్తున్నారు. దీంతోపాటు ప్రొపెల్లర్‌ విమానం డిజైన్‌కూడా సిద్ధం చేశారు. దీనిలో 100 మంది ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. ఫ్లైవింగ్‌ కాన్సెప్ట్‌తో మరో విమానం డిజైన్‌ కూడా తయారు చేశారు. 2035 నాటికి తొలి ఉద్గార రహిత విమానం సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఈ ప్రాజెక్టుకు ఫ్రాన్స్‌ ప్రభుత్వం కూడా చేయూతనిస్తోంది.

ఇదీ చూడండి:ఆ బాక్సుతో 15 సెకెన్లలోనే కరోనా ఖతం!

ABOUT THE AUTHOR

...view details