తెలంగాణ

telangana

ETV Bharat / business

గూగుల్​కు 1.68 బిలియన్​ డాలర్ల భారీ జరిమానా - జరిమానా

టెక్​ దిగ్గజం గూగుల్​కు 1.68 బిలియన్​ డాలర్ల భారీ జరిమానా విధించింది ఐరోపా సమాఖ్య(ఈయూ). గూగుల్​ యాడ్​సెన్స్​లో విశ్వసనీయతను దుర్వినియోగం చేసిన కారణంగా ఈ జరిమానా విధించినట్లు ఈయూ వెల్లడించింది. ఈ అంశంలో గూగుల్​కు ఈయూ జరిమానా విధించడం ఇది మూడో సారి.

గూగుల్​

By

Published : Mar 21, 2019, 7:34 AM IST

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్​కు ఐరోపా సమాఖ్య (ఈయూ) 1.68 బిలియన్​ డాలర్ల భారీ జరిమానాను విధించింది. ఆన్​లైన్​ ప్రకటనల్లో విశ్వసనీయతను దుర్వినియోగం చేసిందనే ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది ఈయూ.

ఈ అంశంలో గూగుల్​కు ఈయూ జరిమానా విధించడం ఇది మూడో సారి. వేర్వేరు కారణాలతో గూగుల్​ మాతృ సంస్థ ఆల్ఫాబెట్​కు​ గతేడాది 4.34 బిలియన్​ డాలర్లు, 2017లో 2.42 బిలియన్ డాలర్ల జరిమానాను విధించింది ఐరోపా సమాఖ్య.

గూగుల్​ యాడ్​సెన్స్​ ప్రకటనల వ్యాపారంపై... చాలాకాలంగా కొనసాగుతున్న దర్యాప్తు వివరాలను ఈయూ కాంపిటీషన్​ కమిషనర్​ మార్గరెట్​ వెస్టాగర్​ ప్రకటించారు.

''ప్రకటనల విషయంలో గూగుల్..​ యాడ్​సెన్స్​ కాకుండా ఇతర బ్రోకర్లు వినియోగించే వెబ్​సైట్లను నిలుపుదల చేసి తన విశ్వసనీయతను కోల్పోయింది.వినియోగదార్లను తప్పుదోవ పట్టిస్తూ నిబంధనల్ని ఉల్లంఘించింది.ఈ చర్యలతో ప్రకటనల వ్యాపారంలో ప్రత్యర్థులు పోటీ పడేందుకు వీలు లేకుండాగూగుల్వారిని నివారించింది. ఆత్మ రక్షణలో భాగంగా పోటీని తగ్గించుకునేందుకే గూగుల్​ ఈ చర్యలకు పాల్పడిందని ఈయూ నిర్ధరించింది. '' - మార్గరెట్​ వెస్టాగర్​



ABOUT THE AUTHOR

...view details