తెలంగాణ

telangana

ETV Bharat / business

జెట్​ ఎయిర్​వేస్​ కొనుగోలుకు మూడు సంస్థల బిడ్ - ఆర్థిక బిడ్లు

జెట్​ ఎయిర్​వేస్​ కొనుగోలుకు ఎతిహాద్​తో సహా మరో రెండు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి.

జెట్​ ఎయిర్​వేస్​ కొనుగోలుకు మూడు సంస్థల బిడ్

By

Published : May 10, 2019, 11:59 PM IST

నష్టాలతో తాత్కాలికంగా మూతపడ్డ జెట్​ ఎయిర్​వేస్​లో వాటా కొనుగోలుకు ఎతిహాద్​తో సహా మరో రెండు సంస్థలు ఆర్థిక బిడ్లను దాఖలు చేసినట్లు ఎస్​బీఐ నేతృత్వంలోని రుణదాతల కన్సార్టియమ్​ ప్రకటించింది.

26 బ్యాంకుల కన్సార్టియానికి ప్రస్తుతం జెట్​ ఎయిర్​వేస్​లో 51 శాతం వాటా ఉంది. ప్రస్తుతం రుణదాతలు 31.2 నుంచి 75 శాతం వాటాను విక్రయించాలనుకుంటున్నారు. ఆర్థిక బిడ్ల దాఖలుకు చివరితేది శుక్రవారంతో ముగిసింది.

ఎతిహాద్​ బిడ్లను రుణదాతలు పరీక్షించనున్నట్లు ఎస్​బీఐ ప్రకటించింది. దీనితో పాటు వచ్చిన మరో రెండు బిడ్లపై కూడా నిర్ణయం తీసుకుంటారు. బ్యాంకర్లు వచ్చే వారం బిడ్లను పరీక్షించనున్నారు.

జెట్​ ఎయిర్​వేస్​లో 24 శాతం వాటాను 2013లో ఎతిహాద్​ కొనుగోలు చేసింది. జెట్​ను తిరిగి గాడిన పెట్టేందుకు గత 15 నెలల నుంచి వివిద భాగస్వామ్య సంస్థలతో పనిచేస్తున్నట్లు ఈ గల్ఫ్​ ఎయిర్​లైన్స్​ ప్రకటించింది.

ఏప్రిల్​ 8 నుంచి 12 వరకు ఆసక్తి వ్యక్తీకరణ ద్వారా 4 ప్రాథమిక బిడ్లను స్వీకరించింది. ఇండిగో, టీపీజీ, ఎతిహద్ ఎయిర్​వేస్​లను మొదటి రౌండ్​ బిడ్లలో ఎంపికచేశారు.

ABOUT THE AUTHOR

...view details