ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలను కరోనా మహమ్మారి ఓ కుదుపునకు గురి చేసింది. దుబాయ్ కేంద్రంగా పని చేస్తున్న ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ గత ఏడాది కాలంలో 5.5 బిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేసినట్లు మంగళవారం ప్రకటించింది. గత మూడు దశాబ్దాల కాలంలో ఎమిరేట్స్‌కు ఇదే అతి పెద్ద నష్టం. పశ్చిమాసియాలోనే ఎమిరేట్స్ అతిపెద్ద విమానయాన సంస్థ కావడం గమనార్హం.
ఏడాది కాలంలో ఆదాయం 66 శాతం తగ్గినట్లు వెల్లడించింది ఎమిరేట్స్. కరోనా ప్రభావంతో ప్రయాణాలపై పలు దేశాలు ఆంక్షలు విధించడం ఇందుకు కారణంగా పేర్కొంది. నిర్వహణ ఖర్చులు 46 శాతం తగ్గించుకున్నా.. ఆదాయం 8.4 బిలియన్ డాలర్లు క్షీణించినట్లు వివరించింది.