తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానానికి మస్క్! - ఎలాన్ మస్క్ వార్తలు

స్పేస్​ఎక్స్​తో అంతరిక్షంలో వరుస విజయాలు.. విద్యుత్​ కార్ల కంపెనీ టెస్లా.. ప్రతిష్టాత్మక ఎస్​&పీ 500లో చోటు దక్కించుకోవటం.. ఇలా వరుస విజయాలతో ఈ రెండు సంస్థల సీఈఓ ఎలాన్​ మస్క్ సంపద రాకెట్​ వేగంతో దూసుకెళుతోంది. మరికొన్ని రోజుల్లో కుబేరుల జాబితాలో మార్క్​ జుకర్​బర్గ్​ను దాటనున్నారని బ్లూమ్​బర్గ్ నివేదించింది.

elon musk
ఎలాన్​ మస్క్

By

Published : Nov 17, 2020, 3:37 PM IST

టెస్లా, స్పేస్​ఎక్స్ సీఈఓ ఎలాన్​ మస్క్ సంపద రాకెట్​ వేగంతో పెరుగుతోంది. తన రాకెట్ కంపెనీ స్పేస్​ఎక్స్ ద్వారా అంతరిక్షంలోకి నలుగురు వ్యోమగాములను పంపడం, ఎస్​&పీ 500 స్టాక్స్​ జాబితాలో టెస్లా భాగం కావటం.. మస్క్ జెట్​ స్పీడ్​తో ముందుకెళుతున్నారు.

ఎస్​&పీ 500 జాబితాలో టెస్లా చోటుదక్కించుకోవటం వల్ల ఆయన సంపద ఒక్కసారిగా 15 బిలియన్ డాలర్లు పెరిగింది. అమెరికా స్టాక్ మార్కెట్​లో సోమవారం టెస్లా షేరు విలువ 14 శాతం పెరిగి 408.09 డాలర్ల వద్ద ముగిసింది. ఫలితంగా మస్క్ మొత్తం ఆస్తి విలువ 117.5 బిలియన్​ డాలర్లకు చేరింది.

రికార్డు లాభాలు..

ఈ ఏడాదిలో మస్క్ సంపద మొత్తం 90 బిలియన్​ డాలర్లు పెరిగింది. ప్రపంచంలో 500మంది కుబేరుల్లో ఈస్థాయిలో ఆర్జించి రికార్డు సాధించారు మస్క్. ప్రపంచ అత్యంత ధనవంతుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న మస్క్.. త్వరలోనే ఫేస్​బుక్ అధినేత మార్క్ జుకర్​బర్గ్​ను అధిగమించే అవకాశం ఉందని బ్లూమ్​బర్గ్ నివేదించింది.

ఎలాన్​కు కరోనా..

తాను కరోనా బారిన పడినట్లు మస్క్ శనివారం ప్రకటించారు. స్వల్ప లక్షణాలు ఉన్నట్లు తెలిపారు. అనంతరం తనకు ఎలాంటి లక్షణాలు లేవని ఆదివారం వెల్లడించారు. అదే రోజు స్పేస్​ఎక్స్​ వ్యౌమనౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి నలుగురు వ్యోమగాములను పంపారు.

ఇదీ చూడండి:100బిలియన్ డాలర్లు దాటిన మస్క్ సంపద

ABOUT THE AUTHOR

...view details