తెలంగాణ

telangana

ETV Bharat / business

కొచ్చర్​ దంపతులకు ఈడీ షాక్​.. ఆస్తుల అటాచ్​ - కొచ్చర్​ దంపతులకు ఈడీ షాక్​.. ఆస్తుల అటాచ్​

ఐసీఐసీఐ బ్యాంక్ మనీ ల్యాండరింగ్ కేసులో మాజీ సీఈఓ చందా కొచ్చర్ సహా ఇతరులకు చెందిన రూ.78 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్​ చేసింది ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్. పీఎంఎల్​ఏ చట్టం కింద ముంబయిలోని కొచ్చర్ నివాసం సహా ఆమె భర్త దీపక్ కొచ్చర్​కు చెందిన ఓ కంపెనీని అటాచ్​ చేసింది.

kochhar
కొచ్చర్​ దంపతులకు ఈడీ షాక్​.. ఆస్తుల అటాచ్​

By

Published : Jan 10, 2020, 8:54 PM IST

వీడియోకాన్‌ రుణాల మంజూరు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈఓ చందాకొచ్చర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మరో షాకిచ్చింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కొచ్చర్‌ ఇల్లు, ఆస్తులను కేసుకు అటాచ్‌ చేసింది.

ముంబయిలోని చందాకొచ్చర్‌ ఫ్లాట్‌, ఆమె భర్త దీపక్‌ కంపెనీకి చెందిన కొన్ని ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. వీటి విలువ సుమారు రూ. 78 కోట్లని అధికారులు వెల్లడించారు.

ఇదీ జరిగింది..

వీడియోకాన్‌ గ్రూప్‌ రుణాల మంజూరులో అవకతవకలు జరిగినట్లు పేర్కొంటూ 2019 జనవరిలో చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌, సహా మరికొందరిపై మనీలాండరింగ్‌ ఆరోపణలతో కేసు నమోదు చేసింది ఈడీ. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం ఇప్పటికే చందాకొచ్చర్‌ దంపతులు పలుమార్లు ఈడీ ఎదుట హాజరయ్యారు. అనంతరం సీఈఓ పదవీ నుంచి చందా కొచ్చర్‌ను ఐసీఐసీఐ బ్యాంక్‌ తప్పించింది.

2012లో వీడియోకాన్‌ గ్రూప్ ICICI బ్యాంక్‌ నుంచి రూ. 3,250 కోట్ల రుణాలు పొందిందని, దీని వల్ల కొచ్చర్‌ కుటుంబం లాభపడిందని ఆరోపణలు ఉన్నాయి.

ఇదీ చూడండి: మిస్త్రీ కేసు: ఎన్​సీఎల్​ఏటీ ఆదేశాలపై సుప్రీం స్టే

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details