కార్పొరేట్ల తొలి త్రైమాసిక ఫలితాలు, కీలక ఆర్థిక గణాంకాలు, ఫెడ్ వడ్డీ కోత వంటి అంశాలు స్టాక్ మార్కెట్లకు ఈ వారం దిశానిర్దేశం చేయనున్నాయి. హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్ బ్యాంకు సహా పలు దిగ్గజ సంస్థలు ఈ వారం క్యూ1 ఫలితాలు ప్రకటించనున్నాయి.
గత వారం నష్టాల మోత
గత వారం మొత్తం మీద చూస్తే.. చివరి సెషన్లో తప్ప మిగతా సెషన్లన్నీ నష్టాలతో ముగిశాయి. త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, అంతర్జాతీయ బలహీన సంకేతాలు, దేశంలో చాలా ప్రాంతాల్లో లోటు వర్షపాతం వంటి అంశాలు మదుపరుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. వారం మొత్తం మీద 454 పాయిట్లు కోల్పోయింది సెన్సెక్స్.