పండగ సీజన్ ఆఫర్లతో అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ -కామర్స్ సంస్థలు అమ్మకాలకు వినియోగదారుల నుంచి భారీ స్పందన వచ్చింది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, బిగ్ బిలియన్ డేస్ అంటూ ఈ కంపెనీలు ప్రకటించిన ఆఫర్లతో మొదటి నాలుగు రోజుల్లో 22 వేల కోట్ల అమ్మకాలు జరిగినట్లు తాజా గణాంకాలు స్పష్టం చేశాయి.
అక్టోబర్ 22 వరకు ఈ పండగ అమ్మకాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అమ్మకాల విలువ 4.7 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చునని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సెకనుకు 110 ఆర్డర్లు..
ఫ్లిప్కార్ట్- బిగ్ బిలియన్ డేస్లో సెకను 110 ఆర్డర్లు నమోదైనట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ సమయంలో 66కోట్ల మంది వెబ్సైట్ను సందర్శించినట్లు తెలిపింది. వీటిలో 52 శాతం చిన్న పట్టణాల్లోనే నమోదైనట్లు వెల్లడించింది. ఇప్పటికే కోటి షిప్మెంట్లు పూర్తయినట్లు స్పష్టం చేసింది. ఇప్పటివరకూ జరిగిన సేల్లో సగానికి పైగా ఉత్పత్తులు వర్క్ ఫ్రం హోం విభాగంలోనివేనని పేర్కొంది.