తెలంగాణ

telangana

ETV Bharat / business

గూగుల్‌తో వివాదం.. 10 లక్షల యాప్స్‌తో రానున్న పేటీఎం!

గూగుల్​తో వివాదం నేపథ్యంలో మరో కీలక ప్రకటన చేసింది పేటీఎం. ఇటీవల ప్రారంభించిన తమ మినీయాప్​ స్టోర్​ వేదికగా.. పది లక్షల యాప్​లను తీసుకురావడమే లక్ష్యమని చెబుతోంది. ఇందుకోసం రూ.10 కోట్లు వెచ్చించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది.

By

Published : Oct 9, 2020, 8:24 AM IST

during the conflict with google the paytm is planning to come with 10 laksh apps in mini app store
గూగుల్‌తో వివాదం.. 10 లక్షల యాప్స్‌తో రానున్న పేటీఎం!

గూగుల్‌తో వివాదం నేపథ్యంలో మినీ యాప్‌స్టోర్‌ ప్రారంభించిన పేటీఎం మరో ముందడుగు వేసింది. తమ మినీ యాప్‌స్టోర్‌ వేదికగా పది లక్షల యాప్స్‌ను తీసుకురావడమే లక్ష్యమని ప్రకటించింది. ఇందుకోసం రూ.10 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. గురువారం యాప్‌ డెవలపర్లతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలను ప్రకటించింది. ఈ సందర్భంగా గూగుల్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ అన్నారు.

"30 శాతం ఫీజు వసూలు చేస్తూ టోల్‌ కలెక్టర్‌గా గూగుల్​ వ్యవహరిస్తోంది. అందుకే యాప్‌ డెవలపర్ల కోసం మినీ యాప్‌ స్టోర్‌ తీసుకొచ్చాం. దీనిలో 10 లక్షల యాప్‌లను అందుబాటులో ఉంచడమే మా లక్ష్యం. దేశీయ టెక్నాలజీ ఎకో సిస్టమ్‌ ఏర్పాటుకు మా కంపెనీ కట్టుబడి ఉంటుంది. ఇప్పటికే మా మినీ స్టోర్‌లో 300పైగా యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. డెకథ్లాన్‌, డొమినోస్‌ పిజ్జా, ఫ్రెష్‌ మెనూ, నెట్‌మెడ్స్‌, నోబ్రోకర్‌, ఓలా వంటి యాప్స్‌ అందుబాటులోకి వచ్చాయి. "

-- విజయ్‌ శేఖర్‌ శర్మ , పేటీఎం వ్యవస్థాపకుడు

'నేరుగా ముబైల్​ వెబ్​సైటుతోనే'

యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకునే అవసరం లేకుండా పేటీఎం మినీ యాప్‌ స్టోరు నుంచి నేరుగా మొబైల్‌ వెబ్‌సైటుగా వాడుకునే వీలు తీసుకొచ్చింది పేటీఎం. యాప్‌లలో జరిగే చెల్లింపులకు ఎలాంటి రుసుములు వసూలు చేయబోమని వెల్లడించింది. పేటీఎం వ్యాలెట్‌, పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌, యూపీఐ, నెట్‌ బ్యాంకింగ్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా ఆయా యాప్‌లు తమ వినియోగదారులు చెల్లింపులకు వెసులుబాటు కల్పించే ఏర్పాటు చేసుకోవచ్చని వెల్లడించింది. అలాగే, డెవలపర్లకు అనలిటిక్స్‌, పేమెంట్స్‌కు సంబంధించిన డ్యాష్‌బోర్డు సౌకర్యాన్ని మినీ యాప్‌స్టోర్‌ అందిస్తోంది.

ఏం జరిగిందంటే..

తమ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయంటూ ప్లే స్టోర్‌ నుంచి పేటీఎంతో పాటు 18 యాప్‌లను గూగుల్‌ తొలగించడం వల్ల వివాదం రాజుకుంది. దీంతో పాటు వినియోగించుకునే యాప్‌లలో చెల్లింపులకు సంబంధించిన సేవలు, లావాదేవీలుంటే.. అందులో 30శాతం కమీషన్‌గా తమకు చెల్లించాలని గూగుల్‌ ప్లేస్టోర్‌ నిబంధన విధించింది. అలాగే గూగుల్‌ ప్లేస్టోరులో నమోదైన యాప్‌లు తప్పనిసరిగా తమ బిల్లింగ్‌ సిస్టమ్‌నే వినియోగించుకోవాలని గూగుల్‌ ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో పేటీఎం కొత్తగా మినీ యాప్‌స్టోర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

ఇదీ చూడండి:'కేంద్రం పరిశీలనలో గూగుల్, పేటీఎం వివాదం'

ABOUT THE AUTHOR

...view details