తెలంగాణ

telangana

By

Published : Jun 23, 2021, 12:57 PM IST

ETV Bharat / business

రూ.5.8వేల కోట్ల 'మాల్యా' షేర్లు విక్రయం

విజయ్​ మాల్యా ఆస్తుల విక్రయానికి గ్రీన్​ సిగ్నల్​ వచ్చిన క్రమంలో.. తమ రుణాలను తిరిగి రాబట్టుకుంటున్నాయి బ్యాంకులు. మాల్యాకు చెందిన యునైటెడ్​ బ్రూవరీస్​ లిమిటెడ్​కు చెందిన 5,800 కోట్ల రూపాయల షేర్లను విక్రయించింది ఎస్​బీఐ నేతృత్వంలోని కన్సార్టియం. పీఎన్​బీ బ్యాంకుకు సంబంధించి నీరవ్‌ మోదీ, మోహుల్‌ చోక్సీ నుంచి 40శాతం రుణాలను తిరిగి వసూలు చేసినట్లు తెలిపింది ఈడీ.

bank fraud case against Mallya
మాల్యా ఆస్తుల విక్రయం

రూ.9వేల కోట్లపైగా రుణాలు ఎగవేసి బ్రిటన్‌ పారిపోయిన వ్యాపారి విజయ్‌ మాల్యా నుంచి బ్యాంకులు వాటిని తిరిగి రాబట్టుకుంటున్నాయి. భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ నేతృత్వంలోని కన్సార్టియం తరపున రుణ వసూళ్ల ట్రైబ్యూనల్‌ డీఆర్​టీ(DRT) విజయ్‌ మాల్యాకు చెందిన యునైటెడ్‌ బ్రూవరీస్‌ లిమిటెడ్‌కు చెందిన 5,800 కోట్ల రూపాయల షేర్లను విక్రయించింది.

మరో రూ.800 కోట్లు విలువైన షేర్లను జూన్‌ 25 లోగా విక్రయించి సొమ్ము రాబట్టుకునే అవకాశం ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) తెలిపింది. ఈ షేర్లన్నింటినీ గతంలో మనీలాండరింగ్‌ నిరోధక చట్టం ప్రకారం జప్తు చేసినట్లు వివరించింది.మాల్యా తనను భారత్‌కు తరలించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన కేసును ఓడిపోయారని, ఆయనను భారత్‌కు రప్పించే ప్రక్రియ తుది దశకు చేరుకుందని ఈడీ వెల్లడించింది.

విజయ్‌ మాల్యా సహా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు రుణం ఎగవేసిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ నుంచి 40 శాతం రుణాలను తిరిగి వసూలు చేసినట్లు తెలిపింది. వీరి వల్ల బ్యాంకులకు 22వేల 585 కోట్ల రూపాయల నష్టం జరగగా, 18వేల 170 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ వివరించింది.

ఇదీ చూడండి:మాల్యా ఆస్తుల విక్రయానికి గ్రీన్​ సిగ్నల్!

ABOUT THE AUTHOR

...view details