ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్.. సెప్టెంబరు త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. రెండో త్రైమాసికంలో 30శాతం వృద్ధితో రూ.992 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.701.7 కోట్ల లాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ.4,896.7 కోట్ల నుంచి రూ.5,763.2 కోట్లకు పెరిగింది.
ఈ త్రైమాసిక ఫలితాల ప్రకటనతో రెడ్డీస్ షేర్లు ఒక దశలో గరిష్ఠంగా రూ.4,857.70కు చేరాయి. చివరకు రూ.65.85(1.44శాతం) లాభంతో.. రూ 4,635.80వద్ద ముగిశాయి.