తెలంగాణ

telangana

ETV Bharat / business

టీకా ట్రయల్స్​కు డాక్టర్ రెడ్డీస్ కసరత్తు ముమ్మరం - డాక్టర్ రెడీస్, బయోటెక్నాలజీ ఇండస్ట్రీస్ రీసెర్చ్ కౌల్సిల్ ఒప్పందం

దేశీయ ఔషధ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్​.. రష్యా కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ క్లినికల్ ట్రయల్స్​ వేగం పెంచేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం.. బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్‌ అసిస్టెన్స్‌ కౌన్సిల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

Dr.Reddy"s on Sputnik V vaccine clinical trials
కరోనా వ్యాక్సిన్ కోసం డాక్టర్​ రెడ్డీస్​ కసరత్తు వేగం

By

Published : Oct 29, 2020, 4:49 PM IST

రష్యా తయారు చేసిన‌ స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్ క్లినికల్‌ ట్రయల్స్‌.. ప్రక్రియను వేగవంతం చేసేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ సమాయత్తమవుతోంది. ఇందుకు తాజాగా బయో టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన.. బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్‌ అసిస్టెన్స్‌ కౌన్సిల్‌ (బీఐఆర్​ఏసీ) విభాగంతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ప్రకటించింది.

ఇందులో భాగంగా వ్యాక్సిన్‌ ప్రయోగాలపై బీఐఆర్​ఏసీ పలు సూచనలు ఇవ్వడం సహా వ్యాక్సిన్‌ ప్రయోగ కేంద్రాలను కూడా డాక్టర్‌ రెడ్డీస్‌ వినియోగించుకునే వీలుంటుంది.

కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాం..

స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విభాగం బీఐఆర్​ఏసీతో ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందని సంస్థ ఛైర్మన్‌ సతీష్‌ రెడ్డి తెలిపారు. భారత్‌కు వ్యాక్సిన్‌ను తీసుకొచ్చే ప్రయత్నాలను వేగవంతం చేయడంలో వారితో కలిసి పనిచేయడం కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు.

కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిని వేగవంతం చేయడం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని బయోటెక్నాలజీ మంత్రిత్వశాఖ కార్యదర్శి డాక్టర్‌ రేణు స్వరూప్‌ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:'లింక్డ్​ఇన్​ ద్వారా నిమిషానికి ముగ్గురు నియామకం'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details