ప్రముఖ ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక(అక్టోబర్-డిసెంబర్) ఫలితాలు విడుదల చేసింది. క్యూ3లో సుమారు రూ.570 కోట్ల నష్టాల్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే సమయానికి ఆ సంస్థ సుమారు రూ.485 కోట్ల లాభాల్ని ఆర్జించింది.
క్యూ3లో ఏకీకృత ఆదాయం సుమారు 14 శాతం వృద్ధితో రూ.4,384 కోట్లకు పెరిగింది. గత ఏడాది రూ.3,850 కోట్లుగా ఉంది. క్యూ3 ఫలితాలపై పలు కీలక విషయాలు వెల్లడించారు సంస్థ కో-ఛైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్.
"మూడో త్రైమాసికంలో మా సంస్థ అన్ని వ్యాపారాల్లో మంచి పనితీరును కనబరిచింది. ఈబీఐటీడీఏ అంచనాలను సాధించగలిగాం. కొన్ని ఉత్పత్తులపై ఇంపెయిర్మెంట్ ఛార్జీల కారణంగా లాభాలపై ప్రభావం పడింది. నాణ్యమైన వ్యవస్థ, నిర్వహణ సామర్థ్యాల మెరుగుదలలో తగిన పురోగతి సాధించాం."