తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా మందు తయారీకి రెడ్డీస్ ల్యాబ్స్ కీలక ఒప్పందం - రెడ్డీస్​ చేతికి కరోనా ఔషధం తయారీ అనుమతులు

'రెమ్డెసివిర్‌' ఔషధం కోసం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్​ 'గిలీద్ సైన్సెస్'తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో.. కరోనాకు ఔషధంగా భావిస్తున్న 'రెమ్డెసివిర్‌'​ తయారీ, మార్కెటింగ్ సాంకేతికతను గిలీద్ సైన్సెన్స్.. రెడ్డీస్ ల్యాబొరేటరీస్​కు బదిలీ చేయనుంది.

reddys inks pact with gilead
గిలీద్​తో రెడ్డీస్ ల్యాబ్స్ ఒప్పందం

By

Published : Jun 13, 2020, 5:41 PM IST

అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ సంస్థ 'గిలీద్ సైన్సెస్'​తో కీలక ఒప్పందం కుదుర్చుకున్నట్లు డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబొరేటరీస్ ప్రకటించింది. కరోనా వైరస్​పై పోరాటంలో ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు భావిస్తున్న రెమ్డెసివిర్ రిజిస్ట్రేషన్​, తయారీ, మార్కెటింగ్​ కోసం ఈ ఒప్పందం కుదిరినట్లు తెలిపింది.

127 దేశాల్లో రెమ్డెసివిర్​ తయారీ, మార్కెటింగ్​... ఈ 'నాన్​ ఎగ్జిక్యూటివ్ లైసెన్సింగ్' ఒప్పందం ముఖ్య ఉద్దేశమని వెల్లడించింది రెడ్డీస్ ల్యాబ్స్.

ఈ ఒప్పందంతో రెమ్డెసివిర్​ తయారీకి కావాల్సిన సాంకేతికతను గిలీద్.. రెడ్డీస్​ ల్యాబొరేటరీస్​కు బదిలీ చేస్తుంది. అయితే వివిధ దేశాల్లో ఈ ఔషధం తయారీ, మార్కెటింగ్​కు నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు రావాల్సి ఉందని రెడ్డీస్ ల్యాబ్స్ పేర్కొంది.

ఇదీ చూడండి:మైక్రోసాఫ్ట్​ X​ ట్రంప్... వయా జార్జ్ ఫ్లాయిడ్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details