రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్ 'స్పుత్నిక్-వి'ను విదేశాల్లో విక్రయించే హక్కులను సాధించేందుకు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్)తో చర్చలు జరుపుతున్నట్లు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ప్రకటించింది. భారత్‌లో 250 మిలియన్ వయల్స్ ఉత్పత్తి, పంపిణీ కోసం ఆర్డీఐఎఫ్తో ఇప్పటికే ఒప్పందం కుదిరిన విషయాన్ని గుర్తు చేసింది.
డాక్టర్ రెడ్డీస్‌కు స్పుత్నిక్-వి టీకా విదేశీ అనుమతులు? - స్పుత్నిక్ వి టీకాకు అనుమతులు ఉన్న దేశాలు
భారత్‌లో 'స్పుత్నిక్-వి' టీకా ఉత్పత్తి, పంపిణీకి రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న డాక్టర్ రెడ్డీస్.. విదేశాల్లోనూ ఈ వ్యాక్సిన్ విక్రయ హక్కుల కోసం ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్లు బుధవారం వెల్లడించింది.
స్పుత్నిక్ వి టీకా
'స్పుత్నిక్-వి' టీకాకు భారత్ సహా 63 దేశాల్లో వినియోగ అనుమతులు లభించినట్లు ఇటీవలే డాక్టర్ రెడ్డీస్ వెల్లడిచింది. ఇందులో భాగంగా మే 1న రష్యా నుంచి రెండు లక్షల 'స్పుత్నిక్-వి' డోసులను అందుకుంది. అపోలో ఆస్పత్రులతో ఒప్పందం కుదుర్చుకుని వ్యాక్సిన్ డ్రైవ్‌ను కూడా ప్రారంభించింది.