దేశీయ బ్యాంకింగ్ రంగ దిగ్గజం ఎస్‌బీఐ మరోసారి వడ్డీరేట్లను తగ్గించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎంసీఎల్‌ఆర్ రేటులో 15 బేసిస్ పాయింట్ల మేరకు కోత విధించినట్లు పేర్కొంది. ఇది మార్చి 10 తేదీ నుంచే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ వడ్డీరేట్లను తగ్గించడం ఇది పదోసారి కావడం విశేషం.
కొత్త వడ్డీరేట్లు ఇలా..
- ఏడాది ఎంసీఎల్‌ఆర్ వడ్డీరేటు 10బేసిస్ పాయింట్లు తగ్గి 7.75శాతంగా నిలిచింది. గతంలో ఇది 7.85శాతంగా ఉండేది.
- ఒక నెల ఎంసీఎల్‌ఆర్ వడ్డీరేటుపై 15 బేసిస్ పాయింట్లు తగ్గి 7.45శాతం అయింది.
- మూడు నెలల ఎంసీఎల్‌ఆర్ వడ్డీరేటు 7.65శాతం నుంచి 7.50శాతానికి తగ్గింది.
- ఇక రెండేళ్ల ఎంసీఎల్‌ర్ వడ్డీరేటు 10 బేసిస్ పాయింట్లు తగ్గి 7.95గా ఉండగా.. మూడేళ్ల ఎంసీఎల్‌ర్ రేటు కూడా 10 బేసిస్ పాయింట్లు తగ్గి 8.05శాతంగా ఉంది.
- ఎఫ్‌డీలపై కూడా వడ్డీరేట్లను ఎస్‌బీఐ తగ్గించింది. గతంలో ఫిబ్రవరి 10వ తేదీన కూడా ఒకసారి వడ్డీరేట్లను తగ్గించడం విశేషం. కొత్తగా తగ్గిన వడ్డీరేట్లు మార్చి10 నుంచే అమల్లోకి వచ్చాయి.
సాధారణ ప్రజలకు ఎస్‌బీఐ అందించే తాజా ఎఫ్‌డీ రేట్లు
- 7 రోజుల నుంచి 45 రోజుల వరకు - 4 శాతం
- 46 రోజుల నుంచి 179 రోజుల వరకు - 5 శాతం
- 180 రోజుల నుంచి 210 రోజుల వరకు- 5.5 శాతం
- 211 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ - 5.5 శాతం
- సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ- 5.9 శాతం
- రెండు సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ - 5.9 శాతం
- మూడు సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ - 5.9 శాతం
- ఐదు సంవత్సరాలు నుంచి 10 సంవత్సరాల వరకు - 5.9 శాతం
- సీనియర్ సిటిజన్లకు ఎస్‌బీఐ అందించే ఎఫ్‌డీ రేట్లు ఇలా..
- ఏడు రోజుల నుంచి 45 రోజుల వరకు - 4.5 శాతం
- 46 రోజుల నుంచి 179 రోజుల వరకు - 5.5 శాతం
- 180 రోజుల నుంచి 210 రోజుల వరకు - 6 శాతం
- 211 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ - 6 శాతం
- సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ - 6.4 శాతం
- రెండు సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ - 6.4 శాతం
- మూడు సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ - 6.4 శాతం
- ఐదు సంవత్సరాలు నుంచి 10 సంవత్సరాల వరకు - 6.4 శాతం
యూబీఐ కొత్త వడ్డీరేట్లు నేటి నుంచి..