దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్.. 'పల్సర్' శ్రేణిలో సరికొత్త మోడల్‌ను విడుదల చేయనుంది. 'నెక్ట్స్ జనరేషన్ పల్సర్-250సీసీ' పేరుతో దీనిని మార్కెట్లోకి తీసుకురానుంది. ఇందులో అన్నింటి కంటే ప్రధానంగా కంఫర్టబుల్ సీటింగ్‌తో ఉండే బైక్ డిజైన్.. వాహన ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటుందని సంస్థ తెలిపింది. ఎన్ఎస్/ ఆర్ఎస్ అనే రెండు మోడల్స్‌లో పల్సర్ 220సీసీ రానున్నట్లు సమాచారం.
ఫీచర్లు..
- సరికొత్త ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్
- బాడీ ప్యానెల్స్‌తో కూడిన ఇంధన ట్యాంక్
- స్టెప్-అప్ పిలీయన్(వెనక) సీటు
- కొత్త ఇన్స్ట్రూమెంట్ క్లస్టర్
- కనెక్టివిటీ టెక్నాలజీ
- డ్యూయల్-ఛానల్ ఏబీఎస్
- ఆయిల్-కూల్డ్ ఇంజిన్