మొబైల్ ఫోన్ కంపెనీల మధ్య ప్రస్తుతం కెమెరాల యుద్ధం నడుస్తోంది. కెమెరాల సంఖ్యతో పాటు.. రిజల్యూషన్ వంటి ఫీచర్లపై కంపెనీలు ఎక్కువగా పోటీ పడుతున్నాయి.
2012 సంవత్సరం నుంచి మొదలైన ఈ ట్రెండ్.. మధ్యలో కాస్త తగ్గింది. ఈ ఏడాది 48 మెగా పిక్సెల్ కెమెరాతో మళ్లీ పోటీ ఊపందుకుంది. ఇప్పుడు 64 మెగా పిక్సెల్‌తో సంస్థలు పోటీపడుతున్నాయి.ప్రస్తుతం భారత్‌లో 64 మెగా పిక్సెల్ రియర్ కెమెరాతో నాలుగు ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వాటి ధర రూ.14,990తో ప్రారంభం అవుతుండటం గమనార్హం. ఇంతకీ ఆ మోడళ్లు ఏవి.. వాటి ఇతర ఫీచర్లు ఎలా ఉన్నాయనే విషయాలు మీకోసం.
రియల్మీ ఎక్స్‌టీ..
భారత్‌లో 48 ఎంపీ రియర్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన సంస్థగా 'హానర్' నిలిచింది. అయితే హానర్ సహా.. షియోమీ, శాంసంగ్ వంటి దిగ్గజ సంస్థలకు గట్టి పోటీనిస్తూ రియల్మీ ఏకంగా 4 కెమెరాలు 64 మెగా పిక్సెల్‌తో కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో.. 'రియల్ మీ ఎక్స్‌టీ' పేరుతో ఈ మోడల్ మార్కెట్లోకి వచ్చింది.
ఎక్స్‌టీ ఇతర ఫీచర్లు..
ఈ స్మార్ట్ ఫోన్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది రియల్మీ. వీటి ధరలు వరుసగా రూ.15,999, రూ.16,999, రూ.18,999 గా నిర్ణయించింది.
- 6.4 అంగుళాల ఆమోలెడ్ డిస్ప్లే
- ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్
- స్నాప్‌డ్రాగన్ 712 ప్రాసెసర్
- 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
- 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ
రెడ్మీ నోట్ 8 ప్రో
రియల్ మీ ఎక్స్టీకి పోటీగా అక్టోబర్‌లో రెడ్మీ నోట్8 ప్రోను విడుదల చేసింది షియోమీ. వెనుక వైపు నాలుగు కెమెరాలతో (64 ఎంపీ+8 ఎంపీ+2ఎంపీ+2ఎంపీ).. ఈ మోడల్‌ను విడుదల చేసింది.
ఈ మోడల్ ఇతర ఫీచర్లు..
- 4జీబీ ర్యామ్-64 జీబీ స్టోరేజి వేరియంట్.. ధర రూ.14,999
- 6 జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజి వేరియంట్.. ధర రూ.15,999
- 8 జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజి వేరియంట్.. ధర రూ.17,999
- 6.58 అంగుళాల పూర్తి హెచ్డీ, డాట్ నాచ్ డిస్ప్లే..
- గొరిల్లా గ్లాస్ 5 రక్షణ
- 20 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
- మీడియా టెక్ హీలియో జీ90టీ ప్రాసెసర్
- లిక్విడ్ కూలింగ్ వ్యవస్థ
- అమెజాన్ అలెక్సా అసిస్టెంట్ (బిల్ట్ ఇన్)
- అండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ వ్యవస్థ
- 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ.. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
రియల్ మీ ఎక్స్2 ప్రో..
తొలుత మిడ్ రేంజ్ నుంచి ప్రీమియం ఫోన్లో 64 ఎ పీల రియర్ కెమెరా ఫోన్‌ను విడుదల చేసిన రియల్ మీ.. నవంబర్‌లో పూర్తి ప్రీమియం మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రియల్మీ ఎక్స్2 ప్రోగా ఈ మెడల్‌ను భారత్ మార్కెట్లోకి తెచ్చింది. ఇందులో (64+13+8+20) క్వాడ్ కెమెరా సెటప్‌ను ఉంచింది.