తెలంగాణ

telangana

ETV Bharat / business

ఈ-కామర్స్​ సంస్థల భారీ డిస్కౌంట్​​ ఆఫర్లను నిషేధిస్తారా? - అమెజాన్​

పండుగల వేళ ఆఫర్ల పేరుతో ఈ-కామర్స్ సంస్థలు నిర్వహిస్తున్న ప్రత్యేక సేల్స్​పై.. పలు సంప్రదాయ వ్యాపార సంస్థలు మండిపడుతున్నాయి. ఈ ఆఫర్లు నిషేధించి.. తమ వ్యాపారాలను రక్షించాలని ప్రభుత్వానికి విన్నవించాయి. ఈ అభ్యర్థనపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఆఫర్లపై నిషేధం

By

Published : Sep 14, 2019, 12:58 PM IST

Updated : Sep 30, 2019, 1:51 PM IST

పండుగలు వచ్చాయంటే ఈ-కామర్స్​ దిగ్గజాలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు భారీ డిస్కౌంట్​ ఆఫర్లు ప్రకటిస్తాయి. అయితే ఈ ఆఫర్లతో తమ వ్యాపారం దెబ్బతింటుందని సంప్రదాయ వ్యాపారులు వాపోతున్నారు. పండుగల వేళ ప్రకటిస్తున్న భారీ డిస్కౌంట్లను నిషేధించాలని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) ప్రభుత్వాన్ని కోరింది. ఈ ఆఫర్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలకు పూర్తి విరుద్ధమనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి.

ఈ-కామర్స్‌ సంస్థలు 10 శాతం నుంచి 80 శాతం డిస్కౌంట్లు ప్రకటించడం వల్ల మార్కెట్లో వస్తువుల ధరల్లో తీవ్ర అంతరం ఏర్పడుతోందని కేంద్రానికి రాసిన లేఖలో సీఏఐటీ పేర్కొంది.

దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని... ఇప్పటికే సెప్టెంబర్‌ 29 నుంచి ఆరురోజుల పాటు 'బిగ్‌బిలియన్‌ డేస్‌' పేరిట భారీ డిస్కౌంట్లు ప్రకటించింది ఫ్లిప్​కార్ట్​. త్వరలోనే 'గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్​ సేల్‌' ఆఫర్​తో అమెజాన్ ​ముందుకొచ్చే అవకాశముంది.

ఇదీ చూడండి: 'భారత ఆర్థిక పరిస్థితి మరింత దయనీయం'

Last Updated : Sep 30, 2019, 1:51 PM IST

ABOUT THE AUTHOR

...view details