తెలంగాణ

telangana

ETV Bharat / business

విమానాల ఇంజిన్లు మారిస్తేనే ఇండి'గో'కు అనుమతి

ఇండిగోకు చెందిన ఏ320 నియో విమానాల ఇంజిన్లు మార్చాలని డీజీసీఏ అదేశించింది. నవంబర్​ 19లోగా 23, జనవరి 31లో 97 విమానాల్లోని పీడబ్ల్యూ ఇంజిన్లను మార్చాలని పేర్కొంది. గడువులోగా మార్పులు చేయని విమానాల కార్యకలాపాలను నిలిపివేస్తామని డీజీసీఏ స్పష్టం చేసింది.

విమానాల ఇంజిన్లు మారిస్తేనే.. ఇండి'గో'కు అనుమతి!

By

Published : Nov 1, 2019, 7:01 PM IST

బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగోకు పౌర విమానయాన డెరెక్టరేట్​​ జనరల్ (డీజీసీఏ) ఇంజిన్​ల మార్పుపై మరో సారి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇండిగోకు చెందిన.. 23 ఏ320 నియో విమానాల్లో ప్రాట్​ అండ్ విట్నే (పీడబ్ల్యూ) ఇంజిన్​లను మార్చాలని సూచించింది. నవంబర్​ 19 లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. లేదంటే వాటి కార్యకలాపాలు నిలిపివేస్తామని హెచ్చరించింది డీజీసీఏ.

ఇండిగో వద్ద ఉన్న 97 విమానాలకు.. వచ్చే ఏడాది జనవరి 31లోగా పీడబ్ల్యూ ఇంజిన్​లను మార్చాలని సూచించింది డీజీసీఏ. గత వారం నాలుగు ఇండిగో ఏ320 నియో విమానాల ఇంజిన్లలో సాంకేతిక సమస్యలు తలెత్తిన కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.

దీనిపై సోమవారమే ఇండిగోకు అదేశాలు జారీ చేసింది డీజీసీఏ. 2900 గంటలకు పైగా వాడిన 16 విమానాల ఇంజిన్​లను మాత్రమే మార్చాలని తొలుత సూచించింది. వీటికి నవంబర్​ 12 వరకు గడువు విధించింది. అయితే మరో ఏడు విమానాలు ఇదే రకమైన ఇంజిన్​తో పని చేస్తున్నట్లు గుర్తించి.. వాటితో కలిపి తాజా ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చూడండి: ఆటో రంగానికి కలిసొచ్చిన పండుగ సీజన్​

ABOUT THE AUTHOR

...view details