తెలంగాణ

telangana

ETV Bharat / business

కేబుల్​ బిల్ భారం బేఖాతరు.. వినోదానికే జై! - డీటీహెచ్​

టీవీలో వినోదం ఇటీవల మరింత ప్రియం అయింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) కొత్త టారిఫ్​లతో టీవీ తెరపై బొమ్మ చూడాలంటే భారీగా డబ్బులు చెల్లించుకోక తప్పడం లేదు. అయినప్పటికీ టీవీలు, వినియోగదారులూ పెరిగినట్లు తాజాగా ఐఆర్​ఎస్​ నివేదిక వెల్లడించింది.

కేబుల్​ బిల్ భారం బేఖాతరు.. వినోదానికే జై!

By

Published : Aug 30, 2019, 3:18 PM IST

Updated : Sep 28, 2019, 8:59 PM IST

ఇంతకుముందు నెలనెలా కేబుల్​ బిల్లు కట్టి టీవీ చూసేవాళ్లం. అయితే డీటీహెచ్​లు వచ్చాక కొంతమంది తమకు నచ్చిన ఛానళ్లు మాత్రమే చూసుకునేందుకు వాటివైపు మొగ్గు చూపారు. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్​) కొత్త నిబంధనలతో చాలా మంది వినియోగదారులకు టీవీ చూడటం ఖరీదైన వ్యవహారంగా మారింది.

అయితే వినియోగదారులపై బాదుడు పెరిగినా.. టీవీలు ఉన్న ఇళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు ఐఆర్​ఎస్​ నివేదిక వెల్లడించింది.

2019 మొదటి అర్ధ భాగంలో టీవీలు ఉన్న ఇళ్లు 19.2 కోట్లు ఉండగా 6 నెలల్లోనే ఈ సంఖ్య 19.4 కోట్లకు చేరింది.

కొత్త టారిఫ్​ అమలు...

ఐఆర్​ఎస్​ నివేదిక ప్రకారం 2017 చివరిలో టీవీలు ఉన్న ఇళ్లు 18.3 కోట్లు ఉండగా... 2018కి ఈ సంఖ్య 19.7 కోట్లకు చేరింది. అయితే టారిఫ్​ ఉత్తర్వులు అమలు అవుతాయి అనే లోపు ఈ సంఖ్య 19.2 కోట్లకు తగ్గింది. 2019 ఏప్రిల్​ 1 నుంచి కొత్త టారిఫ్​ నిబంధనల అమలు తర్వాత మళ్లీ 20 లక్షలు పెరిగింది.

వ్యతిరేకత...

చాలామంది వినియోగదారులు ఈ కొత్త టారిఫ్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో రూ.153 ఎన్​సీఎఫ్ (నెట్​వర్క్​ కెపాసిటీ ఫీ) ఛార్జ్​పై ఫిర్యాదు చేస్తున్నారు.

అంతకుముందు ఈ ఛార్జ్​ తప్పనిసరి కాదు. వినియోగదారుడు ఏదైనా ఒక సింగిల్​ ప్యాక్​ను సబ్​స్రైబ్​ చేసుకున్నప్పటికీ ఈ ఛార్జ్​తో కలిపి మొత్తం నెలకు రూ.170 చెల్లించక తప్పదు. దీనిపై అత్యధిక వినియోగదారులు గుర్రుగా ఉన్నారు.

ఎందుకు..?

వినియోగదారులు ఛానళ్లు ఎంచుకోవడంలో, వాటిపై ఖర్చు చేయడంలో పారదర్శకత, ఏకరూపత తీసుకురావడం ట్రాయ్ మార్గదర్శకాల ఉద్దేశం. కొత్త నియమాలలో వినియోగదారులు తమకు ఇష్టమైన ఛానళ్లు ఎంచుకొని వాటి ప్రకారం చెల్లించే స్వేచ్ఛ లభిస్తుంది.

రానున్న రాజుల్లో...

రానున్న రోజుల్లో ఈ టారిఫ్​ విధానంలో మరిన్ని మార్పులు చేయనుంది ట్రాయ్​. ప్రాంతాల వారీగా ఎన్​సీఎఫ్​ ఛార్జీలు, లాంగ్ టర్మ్ ప్యాక్స్​లో డిస్కౌంట్లు, బొకే ఛానళ్ల సంఖ్య తగ్గింపు సహా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకోనుంది. అప్పుడైనా వినియోగదారులపై బాదుడు తగ్గుతుందేమో!

Last Updated : Sep 28, 2019, 8:59 PM IST

ABOUT THE AUTHOR

...view details