తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆదాయం 30శాతం తగ్గితే వేతనాల్లో కోతే! - వ్యాపారాలపై కరోనా ప్రభావం ఎంత

కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రస్తుతం లాక్​డౌన్​ కొనసాగుతోంది. ఈ కారణంగా వ్యాపారా కార్యకలాపాలు చాలా వరకు స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు ఉద్యోగుల వేతనాల కోతకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్​ఎస్​ఈ నమోదిత కంపెనీలపై డెలాయిడ్​ నిర్వహించిన సర్వే ద్వారా ఈ విషయాలు తెలిశాయి. సర్వే నివేదికలో మరిన్ని అంశాలు ఇలా ఉన్నాయి.

nse listed companies wants to cut salaries
ఆదాయం తగ్గితే వేతనాల కోత తప్పదు

By

Published : Apr 30, 2020, 7:06 AM IST

లాక్‌డౌన్‌ కారణంగా ఆదాయాలు 30 శాతం అంత కంటే ఎక్కువ క్షీణిస్తే, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) నమోదిత అగ్రగామి 100 కంపెనీల్లోని 27 సంస్థలు తమ ఉద్యోగుల వేతన భారాన్ని మోయలేవని, జీతాల్లో కోత చేపట్టవచ్చని డెలాయిడ్‌ తన సర్వే నివేదికలో పేర్కొంది. లాక్‌డౌన్‌ కారణంగా అన్ని రంగాల్లో వినియోగం బాగా క్షీణించి, ఆదాయాలు తగ్గి, కంపెనీలు తమ సిబ్బందికి వేతనాలు చెల్లించే సామర్థ్యాన్ని లెక్కవేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోందని పేర్కొంది. ఎన్‌ఎస్‌ఈలో మార్కెట్‌ విలువ ప్రకారం.. తొలి 100 స్థానాల్లో ఉన్న కంపెనీలపై ఈ కంపెనీ జరిపిన సర్వేలో ఇంకా ఏం తేలిందంటే..

  • ఆదాయాలు 30 శాతం కంటే ఎక్కువ క్షీణిస్తే మాత్రం అగ్రగామి 100లో 27 కంపెనీలు తమ లాభాల నుంచి సిబ్బంది ప్రస్తుత వేతనాలను భరించే స్థితిలో లేవు. దాదాపు నగదంతా నిల్వల రూపంలో నిలిచిపోవడం కూడా ఇందుకు కారణం.
  • వేతన చెల్లింపునకు నగదు నిల్వలు ఉపయోగించడం లేదంటే స్వల్పకాలిక రుణాలకు మొగ్గుచూపాలని ఈ 27 కంపెనీలు భావిస్తున్నాయి. వీటిల్లో 11 కంపెనీల రుణం, ఈక్విటీ నిష్పత్తి 1 కంటే ఎక్కువ ఉంది. అంటే వేతనాలు చెల్లించడానికి అప్పుపుట్టడం కూడా కష్టమన్నమాట.
  • అన్ని కంపెనీలు సగటున 5.5 నెలల వరకు కార్యకలాపాలు, వడ్డీలు, వేతన వ్యయాలను భరించేంత నగదు, నగదు సమాన నిల్వలు కలిగి ఉన్నాయి. ఒక 20 కంపెనీలకు మాత్రం 3 నెలల కంటే తక్కువ సమయానికే నగదు సరిపోయేంత ఉంది.
  • ప్రస్తుత నగదు, నగదు సమాన నిల్వల నుంచే అన్ని ఖర్చులూ పెట్టడానికి కంపెనీలకు ప్రస్తుత పరిస్థితులు అంత సౌకర్యవంతంగా లేవు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాటాదార్లు జతచేరిన విలువను వదులుకోడానికి సిద్ధంగా ఉన్నా కూడా.. కొన్ని పెద్ద కంపెనీలకు వేతన కోతలు చేయకతప్పని పరిస్థితులున్నాయి.
  • కంపెనీలు వేతనాలను చెల్లించే సామర్థ్యాన్ని కంపెన్షేషన్‌ కాస్ట్‌ కవరేజీ రేషియో(సీసీసీఆర్‌) ద్వారా లెక్కవేసుకోవాలని డెలాయిట్‌ సూచించింది. ఈ నిష్పత్తి ఎక్కువగా ఉంటే వేతనాలను చెల్లించే సామర్థ్యం ఎక్కువన్నమాట. ఆదాయంలో 30 శాతం క్షీణత కనిపిస్తే మాత్రం.. 1 కంటే తక్కువ సీసీసీఆర్‌ ఉన్న 27 కంపెనీలకు సగటున 4 నెలల వరకు అన్ని ఖర్చులు భరించే శక్తి ఉంటుందని అంచనా.
  • ఇక మొత్తం 100 కంపెనీలకు ఈ నిష్పత్తి 3.25గా ఉంది. దాదాపు 60 శాతం కంపెనీలకు సీసీసీఆర్‌ 4గా ఉంది.
  • రంగాల వారీగా చూస్తే ఇంధన రంగానికి అధికంగా సగటున 6.31 సీసీసీఆర్‌ కనిపిస్తోంది. సేవల రంగానికి 5.6, ఐటీ కంపెనీలకు 1.51గా ఉంది.
  • 100లో 43 కంపెనీల 3 కంటే తక్కువ నిష్పత్తిని; ఆరు కంపెనీలు 10 కంటే ఎక్కువ నిష్పత్తిని కలిగి ఉనన్నారు. ఆ ఆరు కంపెనీలకు ఆస్తులు భారీగా ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details