తెలంగాణ

telangana

ETV Bharat / business

రష్యా టీకా​పై రెడ్డీస్​కు డీసీజీఐ కీలక ఆదేశాలు - కరోనా టీకా తాజా వార్తలు

రష్యా తయారు చేసిన కొవిడ్-19 టీకా 'స్నుత్నిక్​ వి'పై మన దేశంలో రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు డా. రెడ్డీస్​ లేబోరేటరీస్​ సవరించిన ప్రోటోకాల్​ను సమర్పించాలని డీసీజీఐ ఆదేశించింది. ట్రయల్స్​ నిర్వహణకు రెడ్డీస్​ సంస్థ అనుమతి కోరిన నేపథ్యంలో ఈ మేరకు స్పందించింది.

DCGI directs Dr Reddy's lab
రష్యా టీకాపై క్లినికల్ ట్రయల్స్​కు డీసీజీఐ కీలక ఆదేశాలు

By

Published : Oct 6, 2020, 1:40 PM IST

రష్యా కరోనా వ్యాక్సిన్ 'స్నుత్నిక్​ వి'పై భారత్​లో క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహించడానికి డాక్టర్​ రెడ్డీస్​ లేబోరేటరీస్​కు కీలక ఆదేశాలు జారీ చేసింది డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ). ట్రయల్స్​ నిర్వహణ అనుమతి కోసం సవరించిన ప్రోటోకాల్​ను సమర్పించాలని సూచించింది.

"డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబ్​ పంపిన దరఖాస్తును డీసీజీఐ నిపుణుల కమిటీ పూర్తిగా సమీక్షించింది. మరింత సమాచారంతో సవరించిన ప్రోటోకాల్​ను రెడ్డీస్​ ల్యాబ్​ సమర్పించాలని కమిటీ కోరింది."

- ఓ ప్రభుత్వ అధికారి

వ్యాక్సిన్ రెండు, మూడు ట్రయల్స్ నిర్వహణకు అనుమతి కోరుతూ డీసీజీఐకి కంపెనీ ఇటీవల దరఖాస్తు చేసింది.

స్పుత్నిక్‌ వి టీకాను మనదేశంలో పరీక్షించి, ఆ తర్వాత తయారు చేసి విక్రయించటానికి డాక్టర్‌ రెడ్డీస్... రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్‌ (రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌)తో ఒప్పందం కుదుర్చుకుంది. అన్ని అనుమతులు వచ్చాక డాక్టర్‌ రెడ్డీస్‌కు 10 కోట్ల డోసుల స్పుత్నిక్‌ వి టీకాను సరఫరా చేయటానికి ఆర్‌డీఐఎఫ్‌ ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో డాక్టర్‌ రెడ్డీస్‌ తగిన సన్నాహాలు చేపట్టింది. రష్యాలో ఈ టీకాపై ఇప్పటికే మూడో దశ క్లినికల్‌ పరీక్షలు జరుగుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details