టెలికాం దిగ్గజాలు ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాకు టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) విధించిన భారీ జరిమానాకు అమోదం తెలిపింది డిజిటల్ కమ్యూనికేషన్ కమిషన్ (డీసీసీ).రిలయన్స్ జియో నెట్‌వర్క్‌తో ఇంటర్ కనెక్షన్‌కు సహకరించని కారణంగా రూ.3,050 కోట్లు చెల్లించాల్సిందేనని స్పష్టంచేసింది.
తమ వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌లకు చేస్తున్న కాల్స్ 75 శాతం తిరస్కరణకు గురవుతున్నాయని ట్రాయ్‌కి ఫిర్యాదు చేసింది జియో.2016 అక్టోబర్‌లో ఈ మూడు సంస్థలకు (వొడాఫోన్, ఐడియాల విలీనానికి ముందు) రూ.3,050 కోట్ల జరిమానా విధించింది ట్రాయ్.