తెలంగాణ

telangana

ETV Bharat / business

'అమెరికా టికెట్ కోసం మా నాన్న ఏడాది జీతం ఖర్చు' - Sundar Pichai at Inspires Class Of 2020

అమెరికాకు తన ప్రయాణం ఎలా సాగిందన్న అంశంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్​. యూఎస్​కు విమాన టికెట్​ కొనేందుకు తన తండ్రి ఏడాది జీతాన్ని వెచ్చించారని గుర్తు చేసుకున్నారు. తాను విమానం ఎక్కడం కూడా అదే మొదటిసారి చెప్పారు పిచాయ్​.

'Dad Spent Year's Salary On My US Ticket': Google CEO Sundar Pichai Inspires Class Of 2020
'అమెరికా టిక్కెట్ కోసం మా నాన్న ఏడాది జీతం వెచ్చించారు'

By

Published : Jun 8, 2020, 6:28 PM IST

సుందర్​ పిచాయ్​.. ప్రపంచ ప్రఖ్యాత గాంచిన టెక్​ రారాజు గూగుల్​, దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్​ ముఖ్య కార్యనిర్వాహణాధికారి (సీఈఓ). ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వేతనం అందుకుంటున్న సీఈఓల్లో ఒకరు. కానీ ఒకప్పుడు అమెరికా విమాన టికెట్​ కొనేందుకు చాలా కష్టపడ్డారట పిచాయ్​. అందుకోసం ఆయన తండ్రి ఒక ఏడాది జీతాన్ని వెచ్చించాల్సి వచ్చిందట.

2020 పట్టభద్రులనుద్దేశించి యూట్యూబ్​ ద్వారా జరిగిన వర్చువల్​ గ్రాడ్యుయేషన్​ సమావేశంలో ప్రసంగించారు పిచాయ్​. ఈ సందర్భంగా తన మొట్టమొదటి అమెరికా ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

" నా అమెరికా టికెట్​ కోసం మా నాన్న తన ఏడాది జీతాన్ని ఖర్చు చేశారు. అందువల్లే నేను స్టాన్​ఫోర్డ్​ విశ్వవిద్యాలయానికి రాగలిగాను. నా మొదటి విమాన ప్రయాణం కూడా అదే. కానీ నేను ఊహించినదానితో పోలిస్తే అమెరికాలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని కాలిఫోర్నియాలో అడుగుపెట్టిన తర్వాతే తెలిసింది. అప్పట్లో అమెరికా చాలా ఖరీదైనది. కేవలం ఒక్క నిమిషం మా ఇంటికి ఫోన్​కాల్​ చేసుకోవడానికి రెండు డాలర్లుకుపైగా ఖర్చు చేయాల్సి వచ్చింది. అలాగే యూఎస్​లో ఒక పర్సు విలువ భారత్​లో మా నాన్న నెల జీతంతో సమానం. అన్నిటికంటే ముఖ్యంగా నా కుటుంబానికి, మిత్రులకు, ఒకప్పటి నా ప్రేమికురాలు, ప్రస్తుతం నా భార్యకు దూరమయ్యాను. అయితే అప్పట్లో అమెరికాలో నాకు దక్కిన విలువైనది ఏంటంటే.. కంప్యూటర్​. నా జీవితంలో అమెరికా వచ్చిన తర్వాతే మొట్టమొదటిసారిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కంప్యూటర్​ చూసేందుకు వీలుండేది."

- సుందర్​ పిచాయ్​, గూగుల్​ సీఈఓ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details