ప్రముఖ రిటైల్ సూపర్ మార్కెట్ 'డీమార్ట్' మాతృ సంస్థ అవెన్యూ సూపర్ మార్ట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.7,649 కోట్ల ఆదాయాన్ని(Dmart revenue) గడించినట్లు ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే ఈ మొత్తం 46.6 శాతం ఎక్కువని తెలిపింది.
2020-21 రెండో త్రైమాసికంలో అవెన్యూ సూపర్ మార్ట్స్ ఆదాయం రూ.5,218.15 కోట్లుగా ఉంది.
సెప్టెంబర్ 30 నాటికి దేశవ్యాప్తంగా 246 రిటైల్ స్టోర్లు ఉన్నట్లు వెల్లడించింది అవెన్యూ సూపర్ మార్ట్స్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్య ప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, దిల్లీ ఎన్సీఆర్, తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో తమ స్టోర్లు అధికంగా ఉన్నట్లు తెలిపింది.
అవెన్యూ సూపర్ మార్ట్స్కు ప్రముఖ ఇన్వెస్టర్, వ్యాపారవేత్త రాధా కృష్ణ దమానీ, ఆయన కుటుంబం ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నారు.
ఇదీ చదవండి:ఫ్లిప్కార్ట్, అమెజాన్ పోటాపోటీ ఆఫర్లు- బెస్ట్ డీల్స్ ఇవే..