తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనాతో ఎయిర్​ఇండియా ఉద్యోగుల జీతాల్లో కోత

ప్రపంచాన్ని ముప్పుతిప్పులు పెడుతున్న కరోనా ప్రభావం.. విమానయాన సంస్థలపైనా పడింది. ఈ నేపథ్యంలో పలు విమానయాన సంస్థలు వ్యయ నియంత్రణ చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా భారీ నష్టాల్లో కూరుకుపోతున్న ఎయిర్ ఇండియా ఉద్యోగుల జీతభత్యాల్లో కోత విధిస్తున్నట్లు తెలిపింది.

COVID-19: Air India says 'insurmountable' dip in revenues, issues various cost-cutting measures
కరోనాతో ఎయిర్​ఇండియా ఉద్యోగుల జీతాల్లో కోత

By

Published : Mar 20, 2020, 11:17 PM IST

కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు తమ సరిహద్దులను తాత్కాలికంగా మూసేశాయి. ఫలితంగా విమానయాన సంస్థల ఆదాయం భారీగా తగ్గింది. ఈ నేపథ్యంలో పలు సంస్థలు వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్​ ఇండియా క్యాబిన్ సిబ్బంది జీతం మినహా మిగతా ఉద్యోగుల జీతభత్యాల్లో కోత విధించినట్లు తెలిపింది.

మార్చి నుంచి మూడు నెలల పాటు 10 శాతం తగ్గించడమే కాకుండా వ్యయ నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన బకాయిలను పొందడానికి ప్రత్యేక డ్రైవ్​ చేపట్టాలని ఎయిర్​ఇండియా నిర్ణయించింది. దీనికి సంబంధించి అధికారులు చర్యలు వేగవంత చేస్తున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి:ఉద్యోగులకు కరోనా దెబ్బ- జీతాలు తగ్గిస్తున్న సంస్థలు

ABOUT THE AUTHOR

...view details