కొవిడ్-19 (కరోనా వైరస్) ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. వైరస్ దెబ్బకు పలు రంగాలు ఇప్పటికే మూలనపడ్డాయి. వైరస్ వ్యాప్తి విమానయాన రంగంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే వందలాది విమానాలు రద్దయ్యాయి. ఫలితంగా బుకింగ్స్‌తో సహా విమానాశ్రయంలోని దుకాణాల్లో అమ్మకాలు పడిపోయాయి.
అతికష్టం మీద విమానయాన సంస్థలను నడుపుతున్నారు నిర్వాహకులు. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా విధించిన ప్రయాణ ఆంక్షలు, ముడి చమురు ధరలు పడిపోవడం వల్ల విమానయాన సంస్థలపై పెనుభారం పడిందని నిపుణులు పేర్కొన్నారు.
ఏప్రిల్ 15 వరకు వీసాల రద్దు
వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే భారత్‌లో సుమారు 490కి పైగా విదేశీ విమానాలు రద్దయ్యాయి. మరో 90కి పైగా దేశీయ విమాన సర్వీసులను నిలిపివేశారు. కరోనా మహమ్మారిని నియత్రించేందుకు భారత్ ఇప్పటికే దౌత్య, ఉద్యోగ సంబంధిత వీసాలు మినహా అన్నింటినీ ఏప్రిల్ 15 వరకు నిలిపివేసింది.
70 వేల నుంచి 62వేలకు..