ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది దేశీయ విమానయాన సంస్థ గోఎయిర్. కరోనా సంక్షోభం కారణంగా ఆ సంస్థలో పనిచేసే సిబ్బంది వేతనంలో 50శాతం కోత పెట్టనుంది. ఈ మేరకు గోఎయిర్ సీఈఓ వినయ్ డ్యూబ్ ఓ ప్రకటనలో తెలిపారు.
కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటికే పలు విమాన సర్వీసులు రద్దయినందున ఆదాయాలు క్షీణించాయి. ఇదివరకే కొందరు పైలట్లను తొలగించగా.. మరికొందరు ఉద్యోగులకు వేతనంలేని సెలవులను ప్రకటించింది గోఎయిర్. అయితే ఈ చర్యలన్నీ తాత్కాలికమేనని.. వైరస్ సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొనేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు వినయ్.