తెలంగాణ

telangana

ETV Bharat / business

వెంటాడుతున్న కరోనా భయాలు- కొనసాగుతున్న నష్టాలు - స్టాక్​ మార్కెట్​ అప్​డేట్స్​

కరోనా భయాలతో స్టాక్ మార్కెట్లు నేడూ నష్టాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 201 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోంది. నిఫ్టీ 62 పాయింట్లకు పైగా క్షీణతతో ట్రేడింగ్​ సాగిస్తోంది.

నేటి స్టాక్ మార్కెట్లు
STOCK MARKETS TODAY

By

Published : Feb 27, 2020, 9:44 AM IST

Updated : Mar 2, 2020, 5:30 PM IST

స్టాక్ మార్కెట్లను కరోనా భయాలు వెంటాడుతున్నాయి. ఈ మహమ్మారి ఇతర దేశాలకు వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా ఆ ప్రభావం దేశీయ సూచీలపైనా కనిపిస్తోంది.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్ 201 పాయింట్లకు పైగా నష్టంతో.. ప్రస్తుతం 39,687 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 62 పాయింట్లకు పైగా క్షీణతతో 11,615 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివివే..

ఎన్​టీపీసీ, టైటాన్​, ఎల్​&టీ, నెస్లే ఇండియా, కోటక్ మహీంద్రా​ బ్యాంక్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

హెచ్​సీఎల్ ​టెక్​, టీసీఎస్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఎం&ఎం, సన్​ఫార్మా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఇదీ చూడండి:కరోనాతో స్టాక్ మార్కెట్లకు గండం తప్పదా?

Last Updated : Mar 2, 2020, 5:30 PM IST

ABOUT THE AUTHOR

...view details