కేంద్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, అక్టోబర్లో... ఎనిమిది ప్రధాన మౌలిక పరిశ్రమల ఉత్పత్తి 5.8 శాతం తగ్గింది. ఇది దేశంలో ఆర్థికమందగమనం తీవ్రతను సూచిస్తోంది. గతేడాది ఇదే కాలానికి ఈ కీలక రంగాలు 4.8 శాతం వృద్ధిని నమోదుచేయడం గమనార్హం.
ఉత్పత్తుల తగ్గుదల
అక్టోబర్లో.. ఎనిమిది ప్రధాన పరిశ్రమల్లోని ఆరింట్లో ఉత్పత్తి బాగా తగ్గిపోయిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బొగ్గు ఉత్పత్తి 17.6 శాతం తగ్గగా.. ముడిచమురు 5.1 శాతం పతనమైంది. సహజవాయువు ఉత్పత్తిలో 5.7 శాతం తగ్గుదల నమోదైంది.
అక్టోబర్లో.. సిమెంట్ ఉత్పత్తి 7.7 శాతం, స్టీల్ 1.6 శాతం, విద్యుచ్ఛక్తి ఉత్పత్తి 12.4 శాతం మేర పతనమయ్యాయి.