తెలంగాణ

telangana

ETV Bharat / business

'పీఎంసీ కుంభకోణం కేసును క్షుణ్ణంగా పర్వవేక్షిస్తున్నాం'

పీఎంసీ కుంభకోణంపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ఈ దర్యాప్తును ఆర్బీఐ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు శక్తికాంతదాస్​.

'పీఎంసీ కుంభకోణం కేసును క్షుణ్ణంగా పర్వవేక్షిస్తున్నాం'

By

Published : Nov 7, 2019, 7:26 PM IST

భారీ కుంభకోణంలో చిక్కుకున్న పంజాబ్​ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్​ బ్యాంకు(పీఎంసీ)...​ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్​ తెలిపారు. బ్యాంకుపై ఫోరెన్సిక్ ఆడిట్​ కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఆర్థిక స్థిరత్వ అభివృద్ధి మండలి (ఎఫ్​ఎస్​డీసీ)తో సమావేశం ముగిసిన అనంతరం ఈ విషయాలు తెలిపారు దాస్.

దేశంలోని 10 ప్రధాన సహకార బ్యాంకుల్లో పీఎంసీ ఒకటి. ఆరు నెలల నుంచి భారీగా రుణాలు పేరుకుపోయిన కారణంగా సెప్టెంబర్​లో పీఎంసీ పర్యవేక్షణను ఆర్బీఐ తీసుకుంది. హెచ్​డీఐఎస్ అనే మౌలిక వసతుల కల్పన సంస్థకు ఇచ్చిన రుణాలతో.. రూ.4,355 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఆర్బీఐ గుర్తించింది.

ఈ నేపథ్యంలో బ్యాంకు ఖాతాదారులకు నగదు ఉపసంహరణపై పరిమితులు విధించింది ఆర్బీఐ. తొలుత ఈ పరిమితిని రూ.40,000గా నిర్ణయించింది. తాజాగా రూ.50,000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

పీఎం​సీ కుంభకోణం కేసులో.. హెచ్​డీఐఎల్​ ప్రమోటర్లు రాకేశ్​, సారంగ్, వాద్వాన్ సహా మొత్తం అయిదుగురును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పీఎంసీ కుంభకోణం బయటపడటం కారణంగా.. ఆ బ్యాంకు ఖాతాదారుల్లో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. దాదాపు 10 మంది మనస్తాపంతో మృతి చెందారు. బాధితులంతా తమకు న్యాయం చేయాలంటూ ఆర్బీఐ ఎదుట పలు మార్లు నిరసనలకు దిగారు.

ఇదీ చూడండి: అమెరికా-చైనా వాణిజ్య యుద్ధానికి తెరపడనుందా?

ABOUT THE AUTHOR

...view details