తెలంగాణ

telangana

ETV Bharat / business

3 నెలల్లో టెల్కోలు అపరాధ రుసుములు చెల్లించాల్సిందే! - బిజినెస్ వార్తలు తెలుగు

ఏజీఆర్​ ఆపరాధ రుసుములపై టెల్కోలకు టెలికాం విభాగం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. సుప్రీం కోర్టు అదేశాల ప్రకారం మూడు నెలల్లోగా బాకాయిలు తీర్చాలని స్పష్టం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

టెల్కోలకు షాక్​

By

Published : Nov 14, 2019, 6:01 AM IST

సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్​)పై టెలికాం సంస్థలకు సుప్రీం కోర్డు ఆదేశాల ప్రకారమే.. మూడు నెలల్లోగా అపరాధ రుసుములు చెల్లించాలని టెలికాం విభాగం స్పష్టం చేసింది. టెలికాం పరిశ్రమ వర్గాల ద్వారా ఈ విషయం వెల్లడైంది.

స్వయం మదింపు ప్రకియ ద్వారా బాకీలను తీర్చే సదుపాయాన్ని కల్పించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఏజీఆర్​ అసలు కథ ఇదీ..

స్పెక్ట్రం వినియోగ ఛార్జీలు, లైసెన్స్‌ ఫీజులను కలుపుకొని ఏజీఆర్‌ ఛార్జీలుగా చెబుతారు. వీటిల్లో 3-5శాతం స్పెక్ట్రం వినియోగ చార్జీలు, 8 శాతం లైసెన్స్‌ ఫీజుగా చెల్లించాలి. ఈ మొత్తాన్ని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌కు చెల్లించాలి. 1999 తర్వాత ఆదాయంలో వాటా విధానం (రెవెన్యూ షేరింగ్‌) కింద ఏజీఆర్‌ ఛార్జీలను ప్రవేశపెట్టారు. ఈ ఛార్జీలను లెక్కగట్టే విధానంపైనే అసలు వివాదం రాజుకొంది.

టెలికాం సంస్థలు ఆర్జించిన మొత్తం ఆదాయంపై లెక్కగట్టాలని టెలికమ్యూనికేషన్స్‌ శాఖ చెబుతోంది. దీనిలో వ్యాపారేతర ఆదాయం కూడా కలపాలని పేర్కొంది. అంటే.. ఆస్తుల అమ్మకాలు, డిపాజిట్లపై వడ్డీ వంటివి కూడా కలపాలని చెబుతోంది. దీనిని 2005లో సెల్యూలర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీవోఏఐ).. టీడీఎస్‌ఏటీ (టెలికాం డిస్ప్యూట్‌ సెటిల్మెంట్‌ అండ్‌ అప్పిలేట్‌ ట్రైబ్యూన్‌)లో సవాలు చేసింది. దాదాపు 10ఏళ్లు సాగిన ఈ న్యాయపోరాటం 2015లో కొలిక్కి వచ్చింది. టెలికాం సంస్థలకు అనుకూలంగా తీర్పు వచ్చింది. టెలికాం యేతర విభాగాల నుంచి వచ్చిన ఆదాయాన్ని ఏజీఆర్‌ నుంచి మినహాయించాలని పేర్కొంది. మరోపక్క టెలికం సంస్థలు తక్కువ ఆదాయాన్ని చూపుతున్నాయని కాగ్‌ పేర్కొంది.

ఈ తీర్పుపై కేంద్రం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. టీడీఎస్‌ఏటీకు ఒప్పందంలోని నియమాలను, షరతులను సమీక్షించే అధికారం లేదని.. కేవలం ఒప్పందం చట్టపరమైందో..కాదో మాత్రమే చెప్పాలని కేంద్రం వాదించింది.

దీనిపై ఇటీవల సుప్రీం కోర్టులోని త్రిసభ్య ధర్మాసనం కేంద్రానికి అనుకూలంగా తీర్పును ఇచ్చింది. టెలికాం సేవలేతర ఆదాయాన్ని కూడా ఏజీఆర్‌లో చేర్చింది. ఈ మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని పేర్కొంది. దీనిపై అప్పీలుకు వెళ్లే అవకాశం లేదని పేర్కొంది. టెలికాం విభాగ సమాచార ప్రకారకం టెల్కోల బాకాయిలు మొత్తం రూ.1.33 లక్షల కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఏజీఆర్​ బాకీల అంచనాల లెక్క..

  • భారతీ ఎయిర్​టెల్ గ్రూప్- రూ.62,187.73 కోట్లు
  • వొడాఫోన్ ఐడియా- రూ.54,183.9 కోట్లు
  • బీఎస్ఎన్ఎల్​, ఎంటీఎన్​ఎల్​ -రూ.10,675.18 కోట్లు
  • దివాలా తీసిన కంపెనీలైన రియలన్స్, ఎయిర్​సెల్​లు రూ.32,403.47 కోట్లు
  • లిక్విడేషన్​ ప్రక్రియలో ఉన్న కంపెనీలు రూ.943 కోట్లు

ఇదీ చూడండి: విక్రయానికి నోచుకోని ఇళ్లు అమ్మడంలో బెంగళూరు టాప్​!

ABOUT THE AUTHOR

...view details