చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం, టెక్ దిగ్గజం అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా మధ్య వైరం మరింత ముదురుతున్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా జాక్మాపై అణచివేత ధోరణి అవలంబిసున్న జిన్ పింగ్ ప్రభుత్వం.. మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
హాంకాంగ్ కేంద్రంగా పని చేస్తున్న సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ సహా మీడియా సంస్థల్లో అలీబాబా వాటాలను విక్రయించాలని జాక్ మాపై చైనా ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ప్రజాభిప్రాయాల్లో టెక్ దిగ్గజం ప్రభావం పెరుగుతోందన్న ఆందోళనలే ఇందుకు కారణమని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.