చైనా విధానాలను, ఆ దేశ ప్రభుత్వ బ్యాంకింగ్ వ్యవస్థను విమర్శించిన తర్వాత అలీబాబా వ్యవస్థాపకుడు 'జాక్‌మా'కు వరుసగా ఇబ్బుందులు తప్పడం లేదు. ఈ కారణాలతో కొన్ని రోజులుగా ఆయన బహిరంగంగా కనిపించడం లేదు. జాక్‌మా విమర్శలపై చైనా కమ్యునిస్టు ప్రభుత్వం గుర్రుమీదున్న నేపథ్యంలో.. ఆయన కనిపించకుండా పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇలాంటి పరిస్థితులు కొనసాగుతుండగానే.. చైనా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. జాక్‌మాకు చెందిన అలీబాబా, యాంట్ గ్రూప్‌లను జాతీయం చేయాలని చైనా ప్రభుత్వం భావిస్తోందనేది ఈ వార్తల సారాంశం. '60 బిలియన్ డాలర్ల సంపద కలిగిన జాక్‌మాను 'పేదలను దోపిడీ చేసి సంపాదించే రక్త పిశాచి'గా చైనా ప్రభుత్వ సంస్థలు విమర్శిస్తున్నట్లు ఓ నివేదిక సంచలన విషయాలు బయటపెట్టింది.